హోమ్ /వార్తలు /క్రైమ్ /

Man Attacks On Woman: వ్యాపారి చెంపచెల్లుమనిపించిన మహిళ.. ఆగ్రహానికి గురైన వ్యాపారి ఆమెపై.. అసలేం జరిగిందంటే..

Man Attacks On Woman: వ్యాపారి చెంపచెల్లుమనిపించిన మహిళ.. ఆగ్రహానికి గురైన వ్యాపారి ఆమెపై.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man Attacks On Woman: వస్తువులు కొనలేదని ఓ ఫుట్‌పాత్‌ వ్యాపారి మహిళతో అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన సదరు మహిళ అతడి చెంప చెల్లుమనిపించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. పోలీసులు ఆ వ్యాపారిని అరెస్ట్ చేశారు.

  ఫుట్‌పాత్‌ పై ఓ వ్యాపారి వస్తువులను విక్రయిస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఓ మహిళ ఆ వస్తువులను చూసి ఆగింది. ఆ వ్యాపారి వద్దకు వెళ్లి వాటికి సబంధించిన ధరలను తెలుసుకుంది. అందులో ఆమెకు వాటర్ బాటిల్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీని ధర ఎంత అని ఆమె అడిగింది. అతడు ధర ఎక్కువ చెప్పడంతో వద్దని వెళ్లిపోతుండగా.. ఆమెతో ఆ వ్యాపారి అసభ్యంగా మాట్లాడాడు. వస్తువులను కొనడం ఇష్టం లేకపోతే ఎందుకు ధర అడిగావ్.. మాకు పని పాట లేదా.. అంటూ ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టాడు. ఆ గ్రహానికి గురైన సదరు మహిళ అతడి చెంప చెల్లుమనిపించింది. దీంతో వారిద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. మరింత ఆగ్రహానికి లోనైన వ్యాపారి మహిళపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ నగరంలోని అడ్డగుట్టకు చెందిన లక్ష్మి హౌస్‌కీపింగ్‌ గా పని చేస్తోంది. ఇటీవల ఆమె రెతిఫైల్‌ బస్టాండ్ మీదుగా ఆటోలో ఇంటికి వెళ్లేందుకు నడుచుకుంటూ తన స్నేహితురాలితో కలిసి వెళ్తోంది. రేతిఫైల్‌ బస్టాండ్‌ ఎదురుగా ఖాజా అనే వ్యాపారి వాటర్‌ బాటిళ్లతో పాటు పలు వస్తువులు విక్రయిస్తున్నాడు. అక్కడకు వెళ్లిన లక్ష్మి వాటర్ బాటిల్ ధర ఎంత? అని అడిగింది. ధర ఎక్కువ చెప్పడంతో వద్దని వెళ్తుండగా ఖాజా ఆమెను బూతులు తిట్టాడు. ఆగ్రహానికి లోనైన ఆమె చెంప అతడి చెంప మీద కొట్టింది. దీంతో ఫుట్‌పాత్‌ వ్యాపారి ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వెంటనే ఆమె గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఖాజా అనే వ్యాపారి గతంలో కూడా ఇలా వినియోగదారులను బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో పలు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు ఖజాను పోలీస్ స్టేషన్ కే పిలిపించారు. ఫిర్యాదు చేసిన మహళ బంధువు ఒకరు వచ్చి ఖాజాపై దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదుట దాడికి పాల్పడిన అతడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతామని తెలిపారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Cyberabad police, Footpath business, Gopalapuram police station, Hyderabad, Water bottle

  ఉత్తమ కథలు