ఈ మధ్య ఫేస్ బుక్ పరిచయాలు, టిక్ టాక్ ప్రేమలు, షేర్ చాట్ వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియా సైట్లలో పరిచయం అయిన వారితో లేనిపోని రిలేషన్స్ పెట్టుకొని కొందరు జీవితాలు నాశనం చేసుకుంటుంటే.. మరికొందరు లేనిపోని ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. అనంతపురంకు చెందిన అబ్బాయికే ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన విజయ్ కుమార్ అనే యువకుడికి, రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. రోజూ ఫోన్ కాల్స, చాటింగ్ ఎక్కువయ్యాయి. దీంతో అమ్మాయి తనను ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోవాలని...లేకుంటే చనిపోతానని బెదిరించింది. దీంతో విజయ్ కుమార్ తన సోదరుడు నవీన్ తో కలిసి విజయవాడకు చేరుకున్నారు. ఓ హోటల్ లో దిగారు. ఈ విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి చెప్పారు. ఈలోపు ఈ విషయం కాస్త అమ్మాయి ఇంట్లో పెద్దలకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు, విజయ్ బస చేసిన హోటల్ కు వెళ్లారు. ఇద్దర్నీ పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.అయితే తాను చాటింగ్ చేసిన అమ్మాయి మైనర్ అని తనకు తెలియదన్నారు విజయ్. డిగ్రీ చదవినట్లు ఆ అమ్మాయిక తనకు చెప్పిందన్నాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. మొత్తం మీద అమ్మాయి కోసం వెళ్లిన అబ్బాయి.... లేనిపోని చిక్కుల్లో ఇరుక్కున్నాడు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.