అక్కడ సెక్స్ వద్దన్నందుకు భార్యను చితకబాదిన భర్త

ఇక భరించడం తన వల్ల కాదని భావించిన ఆమె..నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన భర్త సోదరులు కూడా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

news18-telugu
Updated: August 16, 2019, 5:58 PM IST
అక్కడ సెక్స్ వద్దన్నందుకు భార్యను చితకబాదిన భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యా భర్తల బంధాన్ని మరింత అన్యోన్యంగా మారుస్తుంది శృంగారం. ఇదే లైంగిక వాంఛ కొన్ని కాపురాల్లో మాత్రం చిచ్చు పెడుతోంది. శృంగారం విషయంలో దంపతుల మధ్య తలెత్తే విభేదాలు ఏకంగా కాపురాలను కూలుస్తున్నాయి. బాత్రూమ్ సెక్స్‌కు ఒప్పుకోలేదని భార్యను చితకబాదాడో భర్త. భావనగర్‌లోని గోమతిపురంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల యువతికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. కొన్ని రోజుల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. ఐతే కామవాంఛలు ఎక్కువగా ఉన్న భర్త ప్రవర్తన వీరి కాపురంలో చిచ్చుపెట్టింది.

సెక్స్ విషయంలో భర్త బలవంత పెట్టడంతో భార్య తిరస్కరించేంది. ఆ కోపంతో ఆమెను అతడు ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. ఐనా ఆమె ఓపికతో భరిస్తూ వచ్చింది. ఇటీవల బాత్రూమ్ సెక్స్ కోసం బలవంతం చేయడంతో.. వద్దని భార్య గొడవ పెట్టుకుంది. తన కోరికను కాదన్నదనే కోపంతో భార్యను అతడు చితకబాదాడు. ఇక భరించడం తన వల్ల కాదని భావించిన ఆమె..నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన భర్త సోదరులు కూడా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు