• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN ASSASSINATED SISTER IN LAW OVER SUSPICION MURDER AT KUKATPALLY VB

Attempt to murder: హైదరాబాద్ లో దారుణం.. అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ మరదలిని హత్య చేసిన బావ.. శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి..

Attempt to murder: హైదరాబాద్ లో దారుణం.. అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ మరదలిని హత్య చేసిన బావ.. శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

Attempt to murder: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ.. మరొకరికి ప్రేమను పంచాలి.. కానీ పగను పెంచుకొని ప్రాణాలను తీసింది. మరదలిపై అనుమానంతో హత్య చేసి తను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ ధైర్యం చాలకపోవడంతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

  • Share this:
    నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ.. మరొకరికి ప్రేమను పంచాలి.. కానీ పగను పెంచుకొని ప్రాణాలను తీసింది. మరదలిపై అనుమానంతో ఆమె ను హత్య చేసి తను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ ధైర్యం చాలకపోవడంతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వరుసకు బావయ్యే ఓ యువకుడు అనుమానంతో తన మరదలి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలమ్మ దంపతుల చిన్న కుమార్తె మంజుల (19) నగరంలో బీటెక్‌ చదువుతోంది. కూకట్‌పల్లి ఏవీబీ పురానికి చెందిన ఢిల్లేశ్వరరావు చిన్న కుమారుడు భూపతి ఈమెకు వరుసకు బావ అవుతాడు. సమీప బంధువులు కావడంతో పెద్దలు వీరికి వివాహం చేయాలని గతంలోనే నిర్ణయించారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా తనతో సరిగా మాట్లాడటం లేదని.. భూపతి తన మరదలిపై అనుమానం పెంచుకున్నాడు.

    అనుమానం కాస్త పగగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మధ్య ఎవరూ లేని సమయంలో మంజులను తన ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. కోపంతో తిట్టుకున్నారు. ఈ వాగ్వాదమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. దీంతో క్షణికావేశానికి గురైన భూపతి.. మరదలి గొంతు నులిమి హతమార్చాడు. వద్దు బావ నన్ను వదిలేయ్ అన్నా వినకుండా అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఏమి చేయాలో అర్థం కాక భయంతో సమీప పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరసింగరావు చెప్పారు.

    పెళ్లి చేసుకోవాల్సిన తనతో కాకుండా ఇతరులతో తిరుగుతోందని అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నది. నిజనిజాలు తెలియకుండా క్షణికావేశంలో తప్పులు చేయడం వల్ల కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. అందుకే ఆవేశం అనార్ధాలకు దారి తీస్తుందని.. ఏ పనైనా చేసే ముందు ఆలోచనతో చేయాలని సీఐ సూచించారు.
    Published by:Veera Babu
    First published: