ఆమెకు 25 ఏళ్లు.. అతడికి 30 ఏళ్లు.. మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఆమెను దారుణంగా..

సుస్మితా, ప్రియుడు కృష్ణచంద్ర సాహు (ఫైల్)

Crime News: మూడేళ్లుగా వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే పెళ్లి చేసుకోమని ప్రియుడిని ప్రేయసి అడగడంతో హత్య చేసినట్లు అతడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ హత్యకు తనకు ఏం సంబంధం లేదని.. ఆ సమయంలో తాను వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని అతడు చెప్పుకొచ్చాడు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

 • Share this:
  వారిద్దరు కాలేజీలో  మూడేళ్లుగా చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. అతడు పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఇద్దరూ శారీరంగాకూడా దగ్గర అయ్యారు. కులాలు అడ్డు వచ్చినా పెళ్లికి సిద్ధమై కొంతకాలం కలసి ఉన్నారు. ప్రస్తుతం యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, యువతి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. గత కొంత కాలంగా ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో అతడు ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు తన గ్రామం రమ్మని.. తెలిసిన వాళ్ల ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ భయటకు వెళ్లి బాటిల్ లో పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై పోశాడు. మంటలను గమనించి చుట్టుపక్కల స్థానికులు మంటలను ఆర్పి వేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఘటనా స్థలంలో రెండు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ సీసాలు, యువతి పాదరక్షలు, అగ్గిపెట్టె తదితరాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. గంజాం ఎస్పీ భ్రజేష్‌కుమార్‌ రాయ్‌ తెలిపిన వివరాల ప్రకారం పూర్తి సమాచారం ఇలా ఉంది.

  ఒడిషాలోని పురుసోత్తపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధి పత్తపూర్‌ గ్రామానికి చెందిన యువకుడు కృష్ణచంద్ర సాహు(30), కభిసూర్యనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని జొలంబో గ్రామానికి చెందిన యువతి సుస్మితా ఖడంగా(25) బరంపురం కళాశాలలో మూడేళ్లు కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, యువతి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఇటీవల భంజనగర్‌ సమీపాన ముజాగడలో చేరింది. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. సుస్మితాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన కృష్ణచంద్రా.. ఆ పేరుతో ఆమెను లైంగికంగా దగ్గర చేసుకున్నాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతి తరచూ ఒత్తిడి తేవడంతో ఆమెను శాశ్వతంగా అడ్డు తొలంగించు కొనేందుకు పధకం పన్నాడు. ఓ రోజు ఆమెను గ్రామానికి రమ్మని పిలిచి పరిచయస్తుల ఇంట్లో ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటలను గమనించిన చుట్టుపక్కల వాళ్లు అందించిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే యువతి 80శాతం కాలిన గాయాలతో పడి ఉంది. తొలుత పురుసోత్తపురం ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.

  అక్కడ చికిత్స పొందుతూ సుస్మిత మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ‘తనను కృష్ణచంద్ర సాహు ప్రతాపపూర్‌కు రమ్మని పిలిచాడు. గ్రామంలోని ఓ నస్యం పరిశ్రమలో తనపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడని యువతి తన మరణ వాంగ్మూలంలో చెప్పిందని’ పురుషోత్తంపూర్‌ ఎస్డీపీఓ సూర్యమణి ప్రధాన్‌ చెప్పారు. సంఘటనా స్థలంలో రెండు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ సీసాలు, పెట్రోల్ బాటిల్, యువతి పాదరక్షలు, అగ్గిపెట్టె తదితరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కృష్ణచంద్ర సాహు తన కుమార్తెను హతమార్చాడని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఎస్డీపీఓ ప్రధాన్‌ పేర్కొన్నారు. యువతి హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, సంఘటన చోటు చేసుకున్న సమయంలో తాను పురుషోత్తంపూర్‌లో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంలో పనిచేస్తున్నానని కృష్ణచంద్ర సాహు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో విలేకరులకు చెప్పాడు. గ్రామస్థులు ఫోను ద్వారా తనకు ఈ విషయం తెలియజేశారని ఆయన పేర్కొన్నాడు. అయిదేళ్లుగా తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదని, రెండేళ్ల కిందట మనస్పర్ధలు వచ్చాయని సాహు పేర్కొన్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహుకి అంతకముందే వివాహం అయిందని తెలిసింది. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
  Published by:Veera Babu
  First published: