అతడు రైల్వేలో టీటీఈ.. గర్భవతిగా ఉన్న తన భార్యను పొలంలోకి లాక్కెళ్లి.. ముక్కలు ముక్కలుగా నరికాడు.. అసలేం జరిగిందంటే..

కాజల్ (ఫైల్ ఫొటో)

Crime News: గర్భవతిగా ఉన్న తన భార్యను అత్యంత దారుణంగా నరికాడు. ముక్కలు ముక్కలుగా చేసి అత్యంత క్రూరంగా చంపేశాడు. ఈ అవమానీయ ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  కట్నం తీసుకోవడం.. ఇవ్వడం చట్ట ప్రకారం నేరం. అయినా తమ కూతురుకు బహుమతిగా ఇస్తున్నామంటూ వధువు తల్లిదండ్రులు చెబుతుంటారు. అయితే అదనపు కట్నం కావాలంటూ భార్యను హింసించిన సంఘటనలు మనం చాలా వరకు చూశాం. అంతే కాకుండా ఆ వేధింపులకు మనస్థాపం చెంది ఎంతో మంది వివాహితలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటిదే బిహర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం గర్భంతో ఉన్న భార్య అని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ ప్రబుద్దుడు. ఈ అవమానీయ ఘటన బిహార్ లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. బిహార్ రాష్ట్రం నలందా జిల్లాలోని నోనియా బిగ్హా గ్రామానికి చెందిన సంజిత్‌, కాజల్‌కు గతేడాది జూన్‌ 27న వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకలు కూడా భారీగా ఇచ్చారు. ఆ సమయంలో అతడికి రైల్వే గ్రూప్ డీ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య అతడికి ప్రమోషన్ వచ్చి టీటీఈ గా జాయిన్ అయ్యాడు.

  అప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తమకు అదనపు కట్నం కావాలని అతడు, అతడి తల్లిదండ్రులు కొంతకాలంగా కాజల్‌ను వేధించసాగారు. ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసలకు గురిచేశారు. ఈ విషయాలను ఆమె తల్లిదండ్రులకు మొరపెట్టుకోగా.. రూ. 80 వేలు ఇచ్చారు. ఆమె ఆ డబ్బులను భర్త సంజిత్ కు ఇచ్చింది. అయినా కూడా గత కొంత కాలం నుంచి ఇంకా కట్నం కావాలంటూ వేధింపులను కొనసాగించారు. అంతటితో ఆగకుండా.. ఆమె గర్భవతి అని కూడా చూడకుండా బిగ్హా గ్రామంలోని పోలాల్లోకి లాక్కునిపోయాడు. అక్కడ ఆమెను అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారు. అయితే జూలై 17 న తన కూతరు చివరిసారిగా తమతో మాట్లాడిందని... తనకు భయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసిందని కాజల్ తల్లి మంజు దేవి చెప్పింది.

  ఆ తర్వాత కొన్ని రోజులు కాజల్‌ సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సంజిత్‌ కూడా కాజల్‌ కన్పించడంలేదని చెప్పాడు. దీంతో, యువతి తండ్రి అరవింద్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బిగ్హా గ్రామంలోని పోలాల్లో జులై 20న కొన్ని శరీర భాగాలు ముక్కలు, ముక్కలుగా ఉండటాన్ని గుర్తించారు. ఆ శరీర భాగాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంజిత్, అతడి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  Published by:Veera Babu
  First published: