MAN ARRESTED IN GADWAL DISTRICT DUE TO HARASSED WOMENS WITH PHONE CALLS VB
Man Arrested : ముందు మహిళలతో పరిచయం చేసుకుంటాడు.. ఆ పరిచయంతో ఫోన్ నంబర్ తీసుకుంటాడు.. ఆపై తన నిజస్వరూపాన్ని..
ప్రతీకాత్మక చిత్రం
మహిళలకు మాయ మాటలు చెప్పి ముందు పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయం సాకుతో వారి వద్ద నుంచి ఫోన్ నంబర్లను తీసకుంటాడు. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఫోన్ చేస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తాడు. ఇతడి ఆగడాలను జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేసి కేసు నమోదు చేశారు.
అమ్మాయిలకు ఫోన్ చేసి లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో బాధితురాలు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ నర్సుకు గుర్తుతెలియని వ్యక్తి కొన్ని రోజులుగా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ప్రతీ రోజు ఫోన్ చేసి లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేస్తుండగా అతని వేధింపులకు విసుగు చెందిన ఆ నర్స్ జోగులాంబ గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి. ఫిర్యాదులో పేర్కొన్న అతడి ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలను తెలుసుకున్నారు. అతని పేరు కోదండ వీరేష్. అనేక పేర్లను మారుస్తూ హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు.
గతంలో హైదరాబాద్ సన్షైన్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా కూడా విధులు నిర్వర్తించేవాడని పోలీసులు గుర్తించారు. అలా ఆసుపత్రికి వచ్చే నర్సులతో పరిచయం చేసుకొనేవాడు. లంచ్ టైంలో , ఖాళీ టైంలో వాళ్లతో మాటలు కలుపుతూ మంచి వాడిలా నటిస్తూ ఫోన్ నంబర్లు సేకరించాడు. అతని పేరు మార్చి ఫోన్ చేసి వేధించేవాడు. ఇలా అతడిపై రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక కేసులు నమోదయ్యాయి. అతడిని పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకొని అక్కడ నుంచి మకాం మార్చుకొని పారిపోయాడు. అతడి నంబర్ ను ట్రేస్ చేయగా ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ లో పేరు మార్చుకొని సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నట్లు గుర్తించారు.
అక్కడ నుంచి మళ్లీ తన వద్ద ఉన్న నర్సుల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసేవాడు. కరోనా కారణంగా కొంత మంది అమ్మాయిలకు ఉద్యోగం పోయింది. దీనిని ఆసరా చేసుకొని తనకు తెలిసిన సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మిస్తూ లోబరుచుకునేవాడు. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి ని గద్వాల ఘటనతో నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. అతడిపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.