ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. నిత్యం ఎవరో ఒకరి రూపంలో మృగాళ్లు అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఓ అంబులెన్స్ డ్రైవర్ బంధువైన యువతిపై విచరణ మరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఓ యువతి (19) 5వ తరగతి వరకు చదువుకొని ఇంటివద్దే ఉంటోంది. ఇటీవల తన తల్లికి యాక్సిడెంట్ అవడంతో ఆమె స్థానంలో యువతి కూలి పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో వరసకు బంధువైన ఓ అంబులెన్స్ డ్రైవర్ యువతిపై కన్నేశాడు. ఆమె పనికి వెళ్లి వస్తుండగా ఆమెకు మాయమాటలు చెప్పి ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆమె ఎవరికీ విషయం చెప్పకుండా ఉండిపోయింది.
ఘటన జరిగినప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఎందుకిలా చేశావని యువతిని తండ్రి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే తమపై పెట్టిన కేసు వెనక్కితీసుకోవాలని నిందితుడు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే చంపేస్తామని నిందితుడు బెదిరిస్తున్నాడని.. తమకు రక్షణ కల్పించాలని కోరూతూ బాధితురాలి తండ్రి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
యువతి తండ్రి ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ.., అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్సైని ఆదేశించారు. నిందితుడిపై అత్యాచారంతో పాటు బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు తెలిసింది. యువతులు ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఎంత తెలిసిన వాడైనా సరే ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు.
ఇటీవల విజయవాడలోనూ ఇలాంటి ఘటనలో జరిగింది. విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లికి లంబాడి తండాకు చెందిన బాలిక (14) పై అదే తండాలో నివాసముంటున్న బాణావత్ ప్రసాద్ అనే యువకుడు కన్నేశాడు. స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా ఆమెతో శారీరక సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో బాలిక ప్రవర్తనలో తేడా రావడంతో గుర్తించిన ఆమె అక్క గట్టిగా నిలదీసింది. దీంతో బాలిక అసలు విషయం బయటపెట్టింది. పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Crime, Crime news, Guntur, RAPE, Telugu news, Vijayawada