ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...

Rape : ఆ యువతి తన కష్టాల్ని అతనికి చెప్పుకోవడమే తప్పైందా? ఆమె వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకొని... రేప్ చేశాడా?

news18-telugu
Updated: November 18, 2019, 9:20 AM IST
ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Mumbai : 18 ఏళ్ల అమ్మాయి. పంజాబ్ నుంచీ పారిపోయి ముంబై వచ్చింది. కామాతిపురలో ఓ దుర్మార్గుడి చేతిలో చిక్కింది. ఈ కేసుకు సంబంధించి రేపిస్టు అక్తర్ రియాజుద్దీన్ ఖురేషీ(45) అరెస్టు చేసిన పోలీసులు... ఏం జరిగిందో వివరించారు. ఇంట్లో సభ్యులతో గొడవపడిన ఆ అమ్మాయి... అక్టోబర్ 17న పంజాబ్‌లోని తన ఇంట్లోంచీ పారిపోయింది. అలా వెళ్లిపోతూ... ఇంట్లో బీరువాలో ఉన్న రూ.10వేలను పట్టుకుపోయింది. తిన్నగా అమృత్‌సర్ వెళ్లింది. ఆ తర్వాత గుజరాత్‌లోని సూరత్ వెళ్లింది. నెక్ట్స్ రాజస్థాన్ వెళ్లింది. ఇవన్నీ తిరిగి... చివరకు... నవంబర్ 9న ముంబై సెంట్రల్‌కి వెళ్లింది. రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న ఆమెను ఎవరికి వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోసాగారు. ఆ సమయంలో అక్తర్ రియాజుద్దీన్ ఖురేషీ కళ్లు ఆమెపై పడ్డాయి. చేతిలో వాటర్ బాటిల్‌తో వెళ్లి... ఆమె కూర్చున్న బెంచీలో మరోవైపు కూర్చున్నాడు. సమస్యేంటి? ఎందుకు ఏడుస్తున్నారు? అంటూ వాటర్ బాటిల్ ఇచ్చి... హీరోలా బిల్డప్ ఇచ్చాడు. బడబడా ఏడ్చేసింది. తర్వాత కోలుకొని... అతనికి మేటర్ మొత్తం చెప్పేసింది.

డోంట్ వర్రీ నీకు ఏ సమస్యా రాదు... నాతో రా... అకామడేషన్ కల్పిస్తా అని నమ్మించాడు. ముంబై సెంట్రల్ నుంచీ అతనితో కలిసి కామాతిపురకు వెళ్లింది. ఓ చోట రోడ్డుపై ఆమెను నిలబెట్టిన ఖురేషీ... ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అంటూ... రోడ్డవతల ఖాళీగా ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడి ఓ మహిళకు అమ్మాయిని చూపించి... ఏదో మాట్లాడాడు. ఆ మహిళ ఏదో చెప్పింది. ఓకే అన్నాడు. పర్స్ తీసి... డబ్బు ఇచ్చాడు. తర్వాత ఆ యువతి దగ్గరకు వచ్చి... నాతో రండి అన్నాడు. ఆమె బయల్దేరింది. ఇద్దరూ రోడ్డు దాటి... ఆ మహిళ ఇచ్చిన గదిలోకి వెళ్లారు.

గది అంత విశాలంగా లేకపోయినా బాగానే ఉంది. నీకు ఫుడ్ తెస్తా అని బయటకు వెళ్లి బిర్యానీ లాంటిది తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ అది తిన్నారు. ఆ తర్వాత... తలుపులు గడియ వేశాడు. ఆమె గడియ ఎందుకు... తీసి ఉంచండి గాలి వస్తుంది అంది. ఇది ముంబై... ఇక్కడ డోర్లు ఓపెన్‌గా ఉంచితే ప్రమాదం అంటూ... గడియ వేసేశాడు. తర్వాత ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఆమె... తన బట్టల సంచిలో డ్రెస్సులను సెట్ చేసుకుంటుంటే... ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఉలిక్కిపడింది. ఏంటి అని కాస్త గట్టిగానే అడిగింది. ఒక్కసారి ప్లీజ్ అన్నట్లు మొహం పెట్టాడు. ఆమె ఆశ్చర్యంగా, టెన్షన్‌గా చూసింది. ఏంటే నీలుగుతున్నావ్... అంటూ... ఆమెను బలవంతంగా బెడ్‌పై పడుకోబెట్టి... రేప్ చేశాడు. ఆమె అరవకుండా నోరు గట్టిగా నొక్కేశాడు. ఆ ఏరియాలో ప్రాస్టిట్యూషన్ కామన్ కావడంతో... ఆమె ఆర్తనాదాలు... ఎవరికీ వినిపించలేదు.

ఈ విషయం ఎవరికైనా చెప్పావో... చంపుతా అంటూ... అక్కడి నుంచీ ఖురేష్ మెల్లగా జారుకున్నాడు. ఆ గదిలోంచీ సీక్రెట్‌గా బయటకు వచ్చిన బాధితురాలు... రోడ్డు పక్కన ఇంతకుముందు చూసిన మహిళను చూసింది. లాగి చెంప చెళ్లుమనిపించింది. ఏడుస్తూ... తన బ్యాగుతో అక్కడి నుంచీ వెళ్లిపోయింది. అలా వెళ్తున్న ఆమెకు ఓ పోలీస్ కానిస్టేబుల్ కనిపించారు. ఆయనకు విషయం చెప్పి ఏడ్చేసింది. ఆయన ఆమెను నగ్పాడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి కేసు రాశారు. ఆమెను ఆస్పత్రికి పంపారు. నెక్ట్స్ మార్నింగ్... ఓ టీ స్టాల్ దగ్గర ఉడికీ ఉడకని పచ్చిమిర్చి బజ్జీ తింటున్న ఖురేషీని పోలీసులు పట్టుకున్నారు.

 

ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?ఇవి కూడా చదవండి :

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణం... ఇవీ కీలక అంశాలు

నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు

Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్
First published: November 18, 2019, 9:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading