అడవుల్లో బాయ్‌ఫ్రెండ్స్‌తో మహిళలు ఏకాంతంగా ఉన్న ప్రైవేటు వీడియోలు తీసి..

బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి అటవీ ప్రాంతంలోకి వచ్చిన మహిళలే లక్ష్యంగా ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. వారి ప్రైవేటు వీడియోలు తీసి బెదిరింపులకు దిగడమే కాకుండా పలువురిని రేప్ కూడా చేశాడు.

news18-telugu
Updated: September 27, 2020, 11:01 AM IST
అడవుల్లో బాయ్‌ఫ్రెండ్స్‌తో మహిళలు ఏకాంతంగా ఉన్న ప్రైవేటు వీడియోలు తీసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి అటవీ ప్రాంతంలోకి వచ్చిన మహిళలే లక్ష్యంగా ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. వారి ప్రైవేటు వీడియోలు తీసి బెదిరింపులకు దిగడమే కాకుండా పలువురిని రేప్ కూడా చేశాడు. అయితే తమ ప్రైవేటు వీడియోలు అతని వద్ద ఉండటంతో బాధిత మహిళలు కూడా ఏం చేయ్యలేకపోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్ దేహట్ రసూలాబాద్ ప్రాంతంలోని అసలాట్‌గంజ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రమోద్ అలియాస్ కల్లు యాదవ్ అసలాట్‌గంజ్ ప్రాంతంలో ఓ గ్రహక్ సేవా కేంద్రాన్ని నడుతుపుతున్నాడు. అయితే అతనికి ఉన్న దుర్భద్దితో ఆ అటవీ ప్రాంతానికి బాయ్‌ఫ్రెండ్స్‌తో వచ్చేవారిని టార్గెట్ చేసుకున్నాడు.

ఆ జంటలను దొంగచాటుగా ఫాలో చేసేవాడు. వాళ్లకి తెలియకుండా వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రైవేటు వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత తాను పోలీసునని, మీడియాకు చెందిన వ్యక్తిని అని మహిళలను వేధించాడు. అలాగే వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా కాజేశాడు. అయితే ఇటీవల ఓ వ్యక్తి పోలీసుల పేరిట మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నాడని సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈ ఘటనకు సంబందించి విచారణను ప్రారంభించారు. వారికి వచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు సాగిన పోలీసులు యాదవ్ ఆట కట్టించారు. అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలు ఉన్న అతని ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక, పోలీసుల విచారణలో నిందితుడు యాదవ్..తన నేరాన్ని అంగీకరించాడు. తాను మహిళలను వేధించడమే కాకుండా.. వీడియోలు తీసిన జంటల వద్ద నుంచి మొబైల్ ఫోన్స్, డబ్బు లాక్కునేవాడని కూడా విచారణలో తేలింది. యాదవ్ ఎక్కువగా పెళ్లికానీ జంటలు, అక్రమ సంబంధం పెట్టకున్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. యాదవ్ విచారణ సందర్భంగా ఈ నేరంతో సంబంధం ఉన్న మరో ముగ్గురి పేర్లు కూడా వెల్లడించాడని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సెక్సువల్ నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ దురాచారి పేరిట క్యాంపెయిన్ ప్రారంభించింది. మహిళలపై సెక్సువల్ వేధింపులు, ఇతర నేరాలకు పాల్పడుతున్న నిందితుల ఫొటోలను రాష్ట్రంలోని ప్రముఖ రోడ్లలో ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసులకు దిశానిర్దేశం చేసింది.
Published by: Sumanth Kanukula
First published: September 27, 2020, 7:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading