ముగ్గురిని పెళ్లి చేసుకొని కట్నం డబ్బులతో ఉడాయించిన నిత్య పెళ్లికొడుకు అరెస్టు

మొదట వివాహం చేసుకున్న బాధితురాలి వద్ద పెద్ద ఎత్తున కట్నం, బంగారం తీసుకున్నాడు. సరిగ్గా 8 నెలలు గడిచిన తర్వాత చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు.

news18-telugu
Updated: October 22, 2019, 10:42 PM IST
ముగ్గురిని పెళ్లి చేసుకొని కట్నం డబ్బులతో ఉడాయించిన నిత్య పెళ్లికొడుకు అరెస్టు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరుస పెళ్లిళ్లతో యువతలను మోసం చేస్తున్న నిత్యపెళ్లికొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన మహేశ్వర్ మొదటిసారి పెళ్లి చేసుకున్న 8 నెలల తరువాత భార్యను విడిచిపెట్టి, మరో యువతిని వివాహం చేసుకున్నాడు. తరువాత ఇంటి నుంచి మాయమైన ఆ ప్రబుద్ధుడు మరో యువతి వెంటపడ్డాడు. దీంతో అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  నిందితుడు మొదట వివాహం చేసుకున్న బాధితురాలి వద్ద పెద్ద ఎత్తున కట్నం, బంగారం తీసుకున్నాడు. సరిగ్గా 8 నెలలు గడిచిన తర్వాత చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు. ఆ తర్వాత మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో కట్నం తీసుకున్నాడు.

ఆ తర్వాత కొంత కాలం తర్వాత లక్నో చేరిన ఈ ప్రబుద్ధుడు తానొక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి మరో యువతిని సైతం పెళ్లి చేసుకొని పెద్ద మొత్తంలో కట్నకానుకలు అందుకున్నాడు. దీంతో బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading