Man Arrested For Killed Roommate : ఉద్యోగం కోసమో లేదా ఉపాధి కోసమో లేక చదువు కోసమో చాలా మంది తమ ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలలో ఉంటుంటారు. హాస్టల్స్ లో ఉండేవాళ్లు కొందరైతే,నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకొని రెంట్ షేర్ చేసుకునేవాళ్లు మరికొందరు. రూమ్ మేట్ ను బట్టే.. మూడ్ ఉంటుంది. వచ్చేవారు సైలెంట్ అయితే.. రూమ్ కూడా అలాగే ఉంటుంది. లేజీ వ్యక్తి వస్తే.. కూడా అంతే పని అక్కడే ఆగిపోతుంది. అన్ని పనులు మీ మీదనే పడిపోతాయి. అయితే రూమ్ మేట్స్ అంటే సర్దుకుపోయే తత్వం ఉండాలి. చెప్పిన పని చేయకపోవడం వంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోనవసరం లేదు. నీకు కుదిరినప్పుడు నువ్వు ఈ పని చెయ్యి..నాకు కుదిరినప్పుడు నేను ఆ పని చేస్తా అంటూ అడ్జస్ట్ కావాలి. ఒకరు చేసే పని లేట్ అయితే ఇంకోకరు అర్థం చేసుకుని అడ్జస్ట్ కావాలే తప్ప ప్రాణాల మీదకు తెచ్చుకోకుడదు. అయితే తాజాగా పాత్రలు కడగలేదని ఓ యువకుడు ఏకంగా రూమ్ మేట్ ప్రాణం తీశాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.
ఒడిశాలోని దెంకనల్ జిల్లాకు చెందిన అమర్ బసంత్ మహోపాత్ర (28),కటక్ జిల్లాకు చెందిన శరత్ కుమార్ దాస్ (21),జార్ఖండ్‌కు చెందిన బిర్జు సాహు (40) ముగ్గురూ పూణెలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బానర్ ప్రాంతంలోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలోని సొసైటీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు ఈ ముగ్గురూ ఓ సెలూన్ లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి రూమ్ లోని అంట్లు తోమాలని శరత్ కుమార్ దాస్ కు..అమర్ చెప్పాడు. అయితే తనను ఆదేశించినట్లుగా శరత్ కుమార్ దాస్ ఫీల్ అయ్యాడు. దీంతో అమర్ పై కోపం పెంచుకున్నాడు. రాత్రి 11:40 గంటలకు రూమ్ లో గొడవ మెుదలైంది. ఆదేశించినట్టుగా చెప్పేసరికి..అమర్ పై వంటగదిలోని కత్తితో దాస్ దాడి చేశాడు. ఛాతీ కింద లోతైన గాయాలు చేశాడు. దీంతో బాధితుడు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో వెంటనే అతడిని రూమ్ లోని మూడో యువకుడు.. హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేదు. అప్పటికే చనిపోయాడు. బిర్జు సాహు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూమ్ మేట్ ని హత్య చేసిన ఆరోపణలపై స్థానిక కోర్టు దాస్ ని శనివారం పోలీసు కస్టడీకి పంపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Maharashtra, Pune news