హోమ్ /వార్తలు /crime /

Extramarital Affair: ఊరిలో భార్య, పిల్లలు.. అద్దె ఇంట్లో ప్రేయసితో సహజీవనం.. భార్యకు అనుమానం.. చివరకు..

Extramarital Affair: ఊరిలో భార్య, పిల్లలు.. అద్దె ఇంట్లో ప్రేయసితో సహజీవనం.. భార్యకు అనుమానం.. చివరకు..

అతని ఇది వరకే పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించాడు.

అతని ఇది వరకే పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించాడు.

అతని ఇది వరకే పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించాడు.

    అతని ఇది వరకే పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. భార్య, పిల్లల్ని సొంతూరులో ఉంచి.. ప్రియురాలితో మరో ఊరిలో అద్దె ఉండసాగాడు. అయితే ఈ క్రమంలోనే చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అతడు ప్రియురాలుని దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో(Bhubaneswar) చోటుచేసుకుంది. వివరాలు.. నయాగఢ్‌లోని చాఢీబంధకు కార్తీక్ జెనాకు 2008లో వివాహం జరిగింది. అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నయాగఢ్‌‌ ప్రాంతానికి చెందిన సంధ్య రాణి(26) భర్తను కోల్పోయింది. ఆమె పని కోసం భువనేశ్వర్‌కు వచ్చింది. మరోవైపు కార్తీక్‌ కూడా భువనేశ్వర్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు.

    అయితే పని కోసం వెతుకుతున్న సమయంలో సంధ్య రాణికి.. బారాముండా బస్టాండ్‌ వద్ద కార్తీక్‌తో పరిచయం ఏర్పడింది. కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పని దొరికేందుకు సంధ్య రాణికి కార్తీక్ సాయం చేశాడు. అక్కడే కార్తీక్ కూడా తాపీ పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక, భార్యను సొంతూరిలో ఉంచిన కార్తీక్.. భువనేశ్వర్‌లోని భరత్‌పూర్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని సంధ్య రాణితో సహజీవనం (Live-in Relation) చేయసాగాడు. అయితే వీరి ఎఫైర్ గురించి కార్తీక్ భార్యకు అనుమానం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి.

    Amazon Great Indian Festival sales: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఆ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. వివరాలు ఇవే..

    ఈ క్రమంలోనే ఓ రోజు సంధ్య రాణి.. కార్తీక్‌ను అతని భార్యను ఒదిలిపెట్టాలని కోరింది. ఇకపై తనతోనే ఉండాలని అడిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు కార్తీక్ భార్యతో మాట్లాడిన సంధ్య రాణి ఆమెను హెచ్చరించింది. దీంతో సంధ్య రాణి ప్రవర్తనపై కార్తీక్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సంధ్య రాణిని వదిలించుకోవాలని అనుకున్నాడు.

    So Sad: పరీక్ష రాసేందుకు కాలేజ్‌కు వచ్చిన విద్యార్థిని.. పాపం కాలేజ్‌లో అందరూ చూస్తుండగానే..

    సెప్టెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి సంధ్య రాణిని హత్య చేసిన కార్తీక్.. అనంతరం ఇంటికి బయట నుంచి లాక్ చేసి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకు సంధ్య రాణి మరణించిన వార్త వెలుగులోకి వచ్చింది. సంధ్య రాణి మృతికి సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సంధ్య రాణి ఉంటున్న ఇల్లు, ఆమె కార్తీక్ అనే వ్యక్తితో కలిసి తీసుకుందని తేలింది. దీంతో పోలీసులు ఈ హత్య వెనక కార్తీక్ హస్తం ఉందని భావించారు. అనంతరం పోలీసులు కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

    First published:

    Tags: Crime news, Odisha

    ఉత్తమ కథలు