పామును చంపి వండుకుని తిన్నారు... చివరకు అరెస్ట్

మనదేశంలో మాములుగా ఎవరైనా పామును చూస్తే ఏం చేస్తారు?.. అక్కడి నుంచి దూరంగా పారిపోతారు. కానీ నలుగురు వ్యక్తులు మాత్రం పామును చంపి.. దాని మాంసాన్ని కూరగా చేసుకుని తిన్నారు.

news18-telugu
Updated: September 20, 2020, 4:08 PM IST
పామును చంపి వండుకుని తిన్నారు... చివరకు అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనదేశంలో మాములుగా ఎవరైనా పామును చూస్తే ఏం చేస్తారు?.. అక్కడి నుంచి దూరంగా పారిపోతారు. కానీ నలుగురు వ్యక్తులు మాత్రం పామును చంపి.. దాని మాంసాన్ని కూరగా చేసుకుని తిన్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. నలుగురు వ్యక్తులు పామును చంపి, వండుకుని తిన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వడపద్ర కలియమ్మన్ టెంపుల్ సమీపంలో నలుగురు వ్యక్తులు ఆరడగులు పామును చంపి.. వండుకుని తిన్న దృశ్యాలు ఉన్నాయి.

ఇది ఫారెస్ట్ అధికారుల కూడా ద‌ృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ వీడియోలోని వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. అందులో ఇద్దరు వ్యక్తులను సురేష్, అతని స్నేహితుడు హుస్సేన్‌గా గుర్తించారు. వెంటనే ట్టూరు టౌన్‌కు సమీపంలోని తంగంబపురిపట్టణంలోని సురేశ్ ఇంటికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేశాడు. హుస్సేన్‌తోపాటు మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.  మాములుగా పాములను వండుకుని తినడం వంటి ఆహారం అలవాట్లను కొన్ని దేశాల్లో చూస్తూంటాం.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading