• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAN ARRESTED FOR IMPERSONATING AS CHRISTIAN TO MARRY WOMAN AND CONVERT HER MK GH

Religion convertion: యువతిని మోసగించి.. మత మార్పిడికి యత్నం.. గుజరాత్‌లో ఘటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ‌పేరుతో ఒక మ‌హిళ‌ను మోసం చేసి, ఆమెను మ‌తం మారాలని బలవంతం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు గుజ‌రాత్‌లోని వ‌డ‌దోర పోలీసులు.

  • Share this:
ప్రేమ‌పేరుతో ఒక మ‌హిళ‌ను మోసం చేసి, ఆమెను మ‌తం మారాలని బలవంతం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు గుజ‌రాత్‌లోని వ‌డ‌దోర పోలీసులు. నిందితుడు స‌మీర్ ఖురేషీ అనే వ్యక్తి, తాను క్రిష్టియ‌న్ అని బాధితురాలిని నమ్మించాడు. త‌న పేరు శ్యామ్ మార్ట‌న్‌ అని చెప్పి, ఆమెను ప్రేమ పేరుతో వంచించాడు. తరువాత మ‌హిళ‌ను బ‌ల‌వంతంగా త‌న అస‌లు మ‌తంలోకి మార్చేందుకు చేసిన ప్ర‌యత్నంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇలా ప్రేమ‌, పెళ్ళి పేరుతో బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడుల‌ను నిరోధించ‌డానికి గుజ‌రాత్ ప్ర‌భుత్వం గుజ‌రాత్ ఫ్రీడ‌మ్ రిలీజియ‌స్ (అమెండ్‌మెంట్‌) యాక్ట్ 2021 చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది.

పెళ్ళి పేరుతో బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడికి పాల్ప‌డినా, మ‌త‌మార్ప‌డి కోసం వివాహం చేసుకున్నా, మ‌త‌మార్పిడి కోసం పెళ్ళి చేసుకునేందుకు సాయం చేసినా ఈ చ‌ట్టం కింద మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష‌తోపాటు రెండుల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తారు. అదే బాధితురాలు మైన‌ర్ లేదా మ‌హిళ‌గానీ, ద‌ళితులు, గిరిజ‌నులు అయితే ఈ జైలు శిక్ష నాలుగేళ్ళ నుంచి ఏడేళ్ళ‌దాకా ఉంటుంది. దీంతోపాటు మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా కూడా విధిస్తారు. ఈ నేప‌థ్యంలో ఓ బాధితురాలు త‌న‌ను బ‌ల‌వంతంగా మ‌త‌ం మార్పించేందుకు స‌మీర్ ఖురేషీ ప్ర‌య‌త్నించాడ‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చాక, రాష్ట్రంలో న‌మోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.

వ‌డోద‌ర‌కు చెందిన 26 ఏళ్ళ స‌మీర్ ఖురేషీ 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. త‌న‌పేరు శ్యామ్ మార్టిన్ అని, తాను క్రిస్టియ‌న్ అని సమీర్ చెప్పాడు. ఈ విష‌యాన్ని నమ్మిన బాధితురాలు స‌మీర్ ఖురేషీతో ప‌రిచ‌యం పెంచుకుంది. ఈ ప‌రిచ‌యాన్ని ఆస‌ర‌గా చేసుకున్న స‌మీర్ బాధితురాలిని ఒక హోటల్‌కు తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఇద్దరూ స‌న్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు చూపి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ, పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో రెండుసార్లు బాధితురాలు గ‌ర్భం దాల్చ‌గా, నిందితుడు అబార్ష‌న్ చేయించాడు. ఈ విషయంపై సదరు యువతి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు వ‌డ‌దోద‌ర జోన్ 2 పోలీసు డిప్యూటీ క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్‌సిన్హా వాలా.

అంతకు ముందు పెళ్ళి చేసుకుంటానని బాధితురాలిని సమీర్ నమ్మించాడు. క్రైస్త‌వ సంప్ర‌దాయంలో కాకుండా, నిఖా ఏర్పాటు చేయ‌డంతో నిందితుడి అస‌లు స్వ‌రూపాన్ని ఆమె తెలుసుకోగ‌లిగింద‌ని పోలీసులు తెలిపారు. పెళ్ళి త‌రువాత సమీర్ బాధితురాలి పేరు మార్చ‌డ‌మే కాకుండా, ఆమెను మ‌తం మారాల్సిందిగా బ‌ల‌వంతం చేశాడ‌ని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స‌మీర్ ఖురేషీని పోలీసులు అరెస్ట్‌చేసి కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: