హోమ్ /వార్తలు /crime /

17 ఏళ్ల యువతిపై కన్నేశాడు... టెన్త్ ఎగ్జామ్స్ రాసి వస్తుండగా కిడ్నాప్ చేసి...

17 ఏళ్ల యువతిపై కన్నేశాడు... టెన్త్ ఎగ్జామ్స్ రాసి వస్తుండగా కిడ్నాప్ చేసి...

Bangalore Crime : టెన్త్ ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చింది... కిడ్నాప్ చేసి పట్టుకుపోయాడు.

Bangalore Crime : టెన్త్ ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చింది... కిడ్నాప్ చేసి పట్టుకుపోయాడు.

Bangalore Crime : టెన్త్ ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చింది... కిడ్నాప్ చేసి పట్టుకుపోయాడు.

    రంజిత్ అలియాస్ గుండా... రెండు నెలలుగా ఉదయనగర్‌లో ఉంటున్న 17 ఏళ్ల ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. పదే పదే ఐలవ్యూ చెప్పి... తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. విషయం తన పేరెంట్స్‌కి చెప్పింది. అతని ఇల్లు... వాళ్ల ఇంటికి కాస్త దగ్గర్లోనే ఉందని తెలిసిన తండ్రి... అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చొచ్చాడు. ఎందుకైనా మంచిదని సైలెంట్‌గా ఆమెను తమ చుట్టాల ఇంటికి పంపించాడు. టెన్త్ ఎగ్జామ్స్ రావడంతో ఆమె ఎక్కడున్నదీ తెలియనివ్వకుండా, ఆమె డిస్టర్బ్ అవ్వకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె కోసం కొన్ని రోజులు వెతికిన రంజిత్... ఇక వెతకడం మానేశాడు. ఎందుకంటే... ఆమె టెన్త్ ఎగ్జామ్స్ రాయడానికి ఆ స్కూలుకు వస్తుందని తెలుసు. అనుకున్నట్లే ఆమె స్కూలుకు వచ్చింది. ఎగ్జామ్ రాసింది. స్కూల్ నుంచీ బయటకు రాగానే ఆమెను కిడ్నాప్ చేసి పట్టుకుపోయాడు. ఆమెను స్కూల్ నుంచీ తీసుకెళ్లేందుకు బంధువొకరు స్కూల్‌కి వచ్చారు. అక్కడ ఆమె కనిపించకపోవడంతో కలకలం రేగింది.

    అమ్మాయి పేరెంట్స్ వెంటనే మహదేవపుర పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రంజిత్ ఇంటికి వెళ్లిన పోలీసులు... అతని తల్లిదండ్రుల ద్వారా అబ్బాయి ఫోన్ నంబర్ తెలుసుకున్నారు. దాని సిమ్ ఆధారంగా అతను ఎక్కడున్నదీ ట్రాక్ చేశారు. ఆ ఊరి చివర చెరువు కట్ట దగ్గరకు ఆమెను తీసుకెళ్లిన రంజిత్... ప్రేమించకపోతే రేప్ చేసి చంపుతానని బెదిరించాడు. ఏం చెయ్యాలో తెలియక ఆ బాధితురాలు టెన్షన్ పడుతూ ఉంటే... సమయానికి పోలీసులు అక్కడకు వెళ్లారు. వాళ్లను చూడగానే పరుగు మొదలుపెట్టాడు రంజిత్. ఆమెను రక్షించిన పోలీసులు... అతన్ని నిమిషాల్లో పట్టుకున్నారు.

    రంజిత్ అరెస్టవ్వడంతో బాధిత ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ఆమె ఎగ్జామ్స్ రాసేందుకు ఎలాంటి సమస్యా ఉండదనీ, ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. రంజిత్‌పై సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసిన పోలీసులు... ఇలా ఎవరైనా వెంటపడి వేధిస్తే... వెంటనే కంప్లైంట్ ఇవ్వమని కోరుతున్నారు.

    ఇవి కూడా చదవండి :

    భద్రాచలం మాదే... మేమే అభివృద్ధి చేస్తాం : చంద్రబాబు సంచలన ప్రకటన

    వైసీపీ వస్తే రాజధాని అమరావతి కాదా... రాజధానిని తరలిస్తారా... నారా లోకేష్ మాటల్లో నిజమెంత...

    జగన్ నాపై దాడులు చేయిస్తున్నాడు... దమ్ముంటే డైరెక్టుగా చర్చకు రావాలి : కే ఏ పాల్

    పసుపు-కుంకుమ నిధులకు బ్యాంకుల బ్రేకులు... ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పాల్సిందేనా...

    First published:

    ఉత్తమ కథలు