Home /News /crime /

పిల్లికి ఉరి వేస్తూ టిక్ టాక్... యువకుడి అరెస్ట్

పిల్లికి ఉరి వేస్తూ టిక్ టాక్... యువకుడి అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లైక్‌ల కోసం, ఇతరులను ఆకట్టుకోవడానికి ఎదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తున్న కొందరు... తాము ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచి వ్యవహరిస్తున్నారు.

    కొందరు నెటిజన్లకు టిక్‌టాక్ పిచ్చి తారాస్థాయికి చేరింది. లైక్‌ల కోసం, ఇతరులను ఆకట్టుకోవడానికి ఎదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తున్న కొందరు... తాము ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచి వ్యవహరిస్తున్నారు. లైక్‌ల కోసం పిల్లికి ఉరివేసి టిక్‌టాక్ చేశారు తమిళనాడుకు చెందిన తంగరాజ్ అనే యువకుడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అయానూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు జంతు ప్రేమికులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తంగరాజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

    కొంతకాలంగా టిక్‌టాక్‌లో ఈ రకమైన హింసాత్మకమైన వీడియోలు ఎక్కువగా రావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ రకమైన హింసాత్మకమైన వీడియోలపై స్పందించిన టిక్‌టాక్ యాజమాన్యం ఇలాంటివి తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. అలాంటి కంటెంట్‌ను తాము నియంత్రించినట్టు పేర్కొంది. సంబంధిత యూజర్ల అకౌంట్లను సస్పెండ్ చేశామని, దీనిపై చట్ట సంస్థలతో చర్చిస్తున్నట్టు తెలిపింది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Tik tok

    తదుపరి వార్తలు