MAN ARRESTED FOR FATHERS DEATH AND DRIVING WITH OUT LICENSE BA MBNR
రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణం.. బైక్ నడిపిన కొడుకు అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు ప్రమాదంలో తన తండ్రి మరణానికి కారకుడైనందుకు అతడిని అరెస్టు చేశారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా బైక్ నడిపి, నర్సింలు చావుకు కారణం అయిన వడ్డే బాలయ్య ను అరెస్టు చేసి, కోర్ట్ ద్వారా రిమాండ్ కు తరలించారు.
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు ప్రమాదంలో తన తండ్రి మరణానికి కారకుడైనందుకు అతడిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఫరూక్ నగర్ మండలంలోని దేవుని పల్లి గ్రామానికి చెందిన వడ్డే బాలయ్య తన తండ్రి నర్సింలును బైక్ మీద ఎక్కించుకుని వెళ్లాడు. తన ఫ్యాషన్ ప్రొ బైక్ మీద ఎక్కించుకొని, కొత్తూర్ నుంచి కిషన్ నగర్ మీదుగా పోమల గ్రామం, నవాబ్ పేట్ మండలం కి వెళ్తుండగా, బండి నడుపుతున్న వడ్డే బాలయ్య, బైక్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడిపాడు. దీంతో బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. బైక్ మీద వెనుక కూర్చున్న నర్సింలు బండి మీద నుంచి రోడ్ మీద పడిపోయాడు. తలకు బలమైన రక్త గాయాలు అయ్యి, అక్కడికక్కడే చనిపోయాడు. ఆ ప్రమాదానికి కారణం అయిన కొడుకు బాలయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా బైక్ నడిపి, నర్సింలు చావుకు కారణం అయిన వడ్డే బాలయ్య ను అరెస్టు చేసి, కోర్ట్ ద్వారా రిమాండ్ కు తరలించారు.
బయటి వారికి బైక్ ఇస్తున్నారా?
ఫ్రెండ్స్, బంధువులు, తెలిసినవాళ్లు బైక్, కారు, ఇతర మన వాహనాలను అడిగితే ఇస్తూ ఉంటాం. అయితే అలా మీ బైక్ తీసుకువెళ్లిన వాళ్లు డ్రంకన్ డ్రైవ్ చేసినా, ఇంకా ఏదైనా మిస్టేక్ చేసినా అది మీకు చుట్టుకునే ప్రమాదం ఉంది.వాళ్లు డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే మీపై అంటే బండి ఓనర్ పై కూడా పోలీసులు యాక్షన్ తీసుకోనున్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్–19 కింద కేసులు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రవేశ పెడుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే మూడు పోలీస్ కమిషనరేట్ల అధికారులు యాక్షన్ ప్లాన్ సైతం రూపొందించారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుల లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఒక వేళ లైసెన్స్ లేకపోతే వాహన యజమానిని బాధ్యుడిగా చేర్చుతూ చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన వారిని ఫస్ట్ రెస్పాండెంట్‌గా, ఓనర్‌ను సెకండ్ రెస్పాండెంట్‌గా నమోదు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఫస్ట్ రెస్పాండెంట్‌కి రూ.10 వేల జరిమానాతో పాటు, ఒకరోజు జైలు శిక్షను న్యాయస్థానాలు విధిస్తున్నాయి. వాహన యజమానికి రూ.5 వేలు జరిమానా విధిస్తున్నాయి. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారికి కోర్టులు రూ.15 వేల ఫైన్, ఒకరోజు జైలు శిక్ష విధిస్తున్నాయి. మద్యం తాగి పట్టుబడిన వారికి 30 శాతం కంటే ఎక్కువ బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్(బీఏసీ) లెవల్స్ ఉంటే వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. బీఏసీ లెవల్స్ 100 శాతం దాటి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.15 వేల ఫైన్, 4 రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తున్నారు