MAN ARRESTED FOR DECEIVING PEOPLE WITH FAKE ONLINE JOB ADS AT DELHI VB
Fake online jobs: విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆన్ లైన్ ప్రకటన.. మోసపోయిన నిరుద్యోగులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం
Fake online jobs: విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని ఆన్లైన్ ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్న48 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేస్తున్న వ్యక్తి అరవింద్ పరేఖ్. ఇతను అస్సాంలోని గువాహటికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.
ఆన్ లైన్ ఉద్యోగ ప్రకటనలు చూసి మీరు సంప్రదిస్తున్నారా.. వారికి ఫోన్ చేసిన తర్వాత ఇంటర్వ్యు, ట్రావెల్ చార్జీలు అంటూ మీమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా అయితే జర ఆలోచించాల్సిందే. ఏ కంపెనీ తమ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయదు.. ఉద్యోగం కోసం డబ్బులు అడగదు. దానిని గమనించి ముందుకు వెళ్తే ఎలాంటి మోసాలు చేసినా మనం గుర్తుపట్టవచ్చు. ఈ మధ్యనే ఉద్యోగ ప్రకటన చూసి ఓ మహిళ మోసపోయింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని ఆన్లైన్ ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్న48 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేస్తున్న వ్యక్తి అరవింద్ పరేఖ్. ఇతను అస్సాంలోని గువాహటికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అనంతరం జరిపిన విచారణలో అతడు 25 మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్టు తేలింది. అతడు తన తోటి స్నేహితుడి సాయంతో ఈ ఆన్లైన్ మోసానికి పాల్పడ్డట్లు తెలిసిందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు, వైద్య పరీక్షలు, ఇంటర్య్వూ, ట్రావెల్ చార్జీలు తదితర వాటికి అని చెప్పి బాధితుల నుంచి డబ్బులు రాబట్ట సాగడు. అతడి భోగోతం ఇలా భయటపడింది..
దిల్లీలో ఓ మహిళ తన భాగస్వామితో కలిసి హోం ఫుడ్ డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటికైనా ఆమెకు విదేశాల్లో మంచి చెఫ్ గా సెటిల్ అవ్వాలనే కోరిక ఉండేది. అలానే ఆమె విదేశాల్లో చెఫ్ ఉద్యోగం కోసం ఆన్లైన్లో ఒక ప్రకటన చూసి సంబంధిత వ్యక్తిని సంప్రదించింది. అతను అమెరికాలోని రెస్టారెంట్లో ఉద్యోగం ఉందని నమ్మబలికాడు. అందుకోసం ఆమె దగ్గర నుంచి కొంత డబ్బు పంపాల్సి ఉంటుందని చెప్పి దగ్గరగ్గర రూ. 36 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళ అతడిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా మొదట ఫోన్ రింగ్ అయినా లిప్ట్ చేయలేదు. అలాగే ప్రయత్నం చేయగా అతని ఫోన్ పని చేయలేదు. దాంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడి వివరాలను రాబట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి బ్యాంక్ ఎకౌంట్ వివరాలను సేకరించామని వాటి ఆధారంగా అతడి పూర్తి చిరునామ కనుక్కునే పనిలో ఉన్నామని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అతుల్ కుమార్ ఠాకూర్ అన్నారు. వాటి ఆధారంగా నిందితుడు అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి, బాధితుల నుంచి డబ్బు తీసుకున్నాడని రుజువైందన్నారు.
ఇటీవలే అతడిని ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో కోల్కతాలోని కస్బా ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. నిందుతుడి నుంచి నాలుగు ఏటీఎం డెబిట్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డు, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంకా ఎంత మంది బాధ్యులు ఉన్నారు . ఇతని వెనుకు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.