MAN ARRESTED FOR CHEATING WOMEN WITH FAKE ACCOUNTS AND COLLECTING NUDE VIDEOS IN ANANTAPUR SU
Andhra Pradesh: పెళ్లి పేరుతో నమ్మించి నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్.. బాధితుల్లో పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
ప్రతీకాత్మక చిత్రం
అమ్మాయిలను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి వారి న్యూడ్ వీడియోలు సేకరించడమే పనిగా పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. అతడి చేతిలో మోసపోయిన బాధితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు.
ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు అదొకటే కాకుండా క్రికెట్ బెట్టింగ్, గంజాయి వ్యాపారంతో పాటు పలు నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. గరంలోని భైరవనగర్‌లో నివాసముంటున్న భరత్ రెడ్డి బీటెక్ మూడో సంవత్సరం వరకు చదివి, ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాటకు బానిసయ్యాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. ఫేస్బుక్, టిండర్ యాప్, తెలుగు మ్యాట్రిమోనిలలో ఫేక్ ఐడీలతో అకౌంట్లు సృష్టించాడు.
ఇక, వాటిలో తన పేరుకు బదులు మరో పేరును ఉంచాడు. ఫొటోను అందమైన వ్యక్తిది పెట్టాడు. వాటి ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారితో చాటింగ్, వాయిస్ కాల్స్ చేసేవాడు. ఇలా వారిని తన మాటలతో నమ్మించేవాడు. పెళ్లి పేరుతో నమ్మించి.. కొందరు యువతులు నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు. అమ్మాయిలు, మహిళలు స్నానం చేసే సమయంలో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించేవాడు. దాదాపు 20 మంది అమ్మాయిలు భరత్ రెడ్డి వలలో చిక్కి మోసపోయినట్టుగా తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఉన్నారు.
మరోవైపు గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతనిపై ఇప్పటికే అనంతపురం వన్‌టౌన్‌లో కిడ్నాప్ కేసు, టూటౌన్లో గ్యాంబ్లింగ్ కేసులున్నాయి. అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న భరత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.