Home /News /crime /

MAN ARRESTED FOR CAUSING DEATH OF BROTHER WIFE FOR PROPERTY IN VIKARABAD SNR MDK

Vikarabad: అన్న చనిపోవడంతో వదినను టార్చర్ పెట్టి చంపిన మరిది..ఎందుకోసమో తెలుసా

(మరిది కాదు మూర్ఖుడు)

(మరిది కాదు మూర్ఖుడు)

Telangana:వికారాబాద్ జిల్లాలో ఓ మరిది అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మలాంటి వదినమ్మ ప్రాణాలు తీసుకునేంతలా టార్చర్ పెట్టాడు. తన కోరిక తీర్చుకునేందుకు ఏకంగా ఆమె శవాన్ని కూడా వదల్లేదు. బంధువు ముసుగులో రాబందులా మారిన మరిదిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

ఇంకా చదవండి ...
రాను రాను మానవ సంబంధాలన్ని ఆర్దిక సంబంధాలు మారిపోతున్నాయి. డబ్బు, ఆస్తి వస్తుందన్న ధనాపేక్షతో తల్లి లాంటి వదినను వేధింపులకు గురి చేశాడో మరిది. అంతే కాదు అన్న చనిపోవడంతో ఆమెను అడ్డుతొలగించుకుంటే ఆస్తి అంతా తనకే వస్తుందని ఆమె బలవన్మరణం చేసుకునేంతగా చిత్రహింసలకు గురి చేసి కపట నాటకం ఆడాడు. వికారాబాద్‌(Vikarabad)జిల్లాలో జరిగిన ఈదారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్(Mominpet)మండలం అమ్రాదికలాన్‌(Amradikalan)లో సంగమణి(Sangamani) అనే మహిళను మరిది శ్రీనివాస్‌(Srinivas)‌ కొద్దిరోజులుగా వేధిస్తూ వచ్చాడు. అన్న ఆశయ్య(Ashayya) పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లలో సంగమని జీవిస్తోంది.

వదినపైన మరిది ఆక్రోశం..
సంగమణి భర్త అశయ్య, అతని సోదరుడు శ్రీనివాస్‌కి చెందిన ఉమ్మడి ఆస్తిగా 12ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మొత్తం తనకు దక్కాలన్న దుర్బుద్దితో తండ్రి సాయంతో వదినను వేధిస్తూ వస్తున్నాడు. మరిది శ్రీనివాస్‌, మామ పెట్టే టార్చర్ భరించలేకపోయిన సంగమణి ఈనెల 16వ తేదిన వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. వదిన కనిపించకపోవడంతో భార్య సాయంతో గాలించిన శ్రీనివాస్ సంగమణి శవాన్ని పొలంలోని బావిలో కనిపించడంతో వదిన చనిపోయిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా మాయం చేద్దామనుకున్నాడు.

ఆస్తి కోసం అఘాయిత్యం..
ఆస్తి కాజేయాలన్న దురాలోచనతో శ్రీనివాస్‌ వదిన శవాన్ని స్నేహితుడి సహాయంతో బావిలోంచి బయటకు తీశాడు శ్రీనివాస్. సంగమణి శవాన్ని గోనె సంచిలో కట్టి బైక్‌పై పెట్టుకొని సంగారెడ్డి జిల్లా సింగూర్‌ డ్యామ్‌లో పడేశాడు. వదిన చనిపోయినట్లు..శవాన్ని డ్యామ్‌లో పడేసిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా మేనేజ్ చేశాడు. వదిని చావుకు కారణమవడమే కాకుండా ఆమె శవాన్ని కనిపించకుండా చేశాడు. తల్లి కనిపించకపోవడంతో..సంగమణి కుమార్తెలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

ఆరు ఎకరాల పొలం కోసం..
విచారణలో భాగంగా పోలీసులుకు శ్రీనివాస్‌పై అనుమానం వచ్చింది. తమదైన శైలీలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. కేవలం ఉమ్మడి ఆస్తిగా ఉన్న 12ఎకరాల పొలంలో సగం అంటే 6ఎకరాల భూమి వదినకు దక్కడం ఇష్టం లేక దాన్ని కూడా తానే కాజేయాలనే దుర్భుద్దితో ఇదంతా చేసినట్లు అంగీకరించాడు. హత్య చేయకపోయినా..ఆత్మహత్యకు పురిగొల్పిన నేరంతో పాటు సంగమణి శవాన్ని కనిపించకుండా చేసినందుకు పోలీసులు శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Vikarabad district

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు