స్మగ్లింగ్ చేసే వాళ్లే అతిక తెలివి ప్రదర్శిస్తే..వాళ్లను పట్టుకునే అధికారులు ఇంకెంత షార్ప్‌గా ఉంటారో అతను ఆలోచించలేకపోయాడు. అతనికి బుర్ర ఉంది కాని అందులో గుజ్జు లేదని నిరూపించుకున్నాడు. ఢిల్లీ(Delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Indira Gandhi International Airport)లోని టెర్మినల్ 3 నుంచి కస్టమ్స్ అధికారులు(Customs officers)ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అబుదాబీ (Abu Dhabi)నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీ చెక్ చేశారు కస్టమ్స్ అధికారులు. అప్పటికి కూడా అతడ్ని చూస్తే అధికారులకు ఎందుకో డౌట్ వచ్చింది. చూడటానికి జంటిల్‌మెన్‌లా కనిపించినప్పటికి అతను ఏదో దాచి పెడుతున్నాడని గమనించి తల నుంచి చెక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే బుక్కపోయాడు స్మగ్లర్. తలపై జుట్టు తీసేసి గుండులా మార్చుకొని ఆ ప్రదేశంలో అంటే బట్టతల ఉండేంత ప్రదేశంలో 660గ్రాముల గోల్డ్‌ని పేస్ట్ (Gold paste)లా మార్చి ఎవరికి అనుమానం రాకుండా తలపై అంటించుకొని పైన విగ్గు (Wig)పెట్టుకున్నాడు. ఇంకేముందు ఎయిర్‌పోర్ట్ నుంచి ఐదు నిమిషాల్లో బయటపడతానుకున్న ప్రయాణికుడ్ని నిలదీసి విగ్గును పరిశీలించడంతో గోల్డ్ బయటపడింది. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికుడు దాదాపు 31లక్షల విలువ చేసే గోల్డ్‌ని పేస్ట్‌ని తన తలపై సీక్రెట్‌గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని గోల్డ్‌ని స్వాధీనం చేసుకున్నారు. తలపైన విగ్గులోనే కాదు చివకు తన పురీషనాళం(Rectum)లో కూడా గోల్డ్‌ని దాచి పెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లుగా కస్టమ్స్ అధికారులు తమ సోదాల్లో గుర్తించారు.
బట్టతలపై బంగారం..
విదేశాల నుంచి వచ్చే వాళ్లు అధికారుల కళ్లుగప్పి అక్రమంగా విదేశీ కరెన్సీ గోల్డ్, డైమండ్స్ తీసుకొని వస్తుంటారు. ఇలాంటి వాళ్లను పట్టుకునేందుకే అంతర్జాతీయస్థాయి ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు చూడగానే దొంగల్ని పసిగట్టే సామర్ధ్యం కలిగిన కస్టమ్స్ అధికారులు ఉంచుతారు. ఇలాంటి వాళ్లకే టోకరా వేద్దామనుకున్నాడు అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికుడు. అతను స్మగ్లింగ్ చేయడానికి ఏకంగా ఇంగ్లీష్ సినిమా ఏమైనా చూశాడా అన్న స్టైల్లో పక్కాగా ప్లాన్ వేసుకొని వచ్చాడు. కాని అధికారులే మనోడికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు.
స్మగ్లర్ బుక్కయ్యాడుగా..
తలపైనే, పురుషనాళం ఉండే ప్రదేశంలో సుమారు 660గ్రాములకుపైగా గోల్డ్‌ని పేస్ట్, పర్సు రూపంలో తరలించాలని ప్రయత్నించాడు. ప్రయాణికుడి దగ్గర లగేజీ కూడ చెక్ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఈసందర్భంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికులు బట్టతల లేకపోయినా విగ్‌లు పెట్టుకొని ఈ విధంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారనే డౌట్‌తో ప్రతి ఒక్కరిని ఇకపై జాగ్రత్తగా పరిశీలించాలని డిసైడ్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Airport, Gold smuggling, Viral Video