పక్కింటి ఆంటీ బాత్రూంలో కెమెరా...వీడియో తీసి బ్లాక్ మెయిల్..ఇంజనీర్ నిర్వాకం...

తాను నివాసం ఉండే పక్కింట్లో మహిళలపై కన్నేసిన ఆ కామాంధుడు.. తన ఇంటిని అనుకొని ఉన్న ఇంట్లోని మహిళలు బాత్రూముల్లో తన ఇంటి బాల్కనీ రెయిలింగ్‌ ఎక్కి ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రంలో మైక్రో కెమెరాలను బిగించి. వీడియోలు తీసేవాడు.

news18-telugu
Updated: May 23, 2020, 10:40 PM IST
పక్కింటి ఆంటీ బాత్రూంలో కెమెరా...వీడియో తీసి బ్లాక్ మెయిల్..ఇంజనీర్ నిర్వాకం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పక్కింట్లో ఆంటీలు స్నానం చేస్తుంటే వారి వీడియోలు తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేయడం పనిగా పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. చదువుకున్నతెలివితేటలను వక్రమార్గంలో ఉపయోగించాడు. మైక్రో కెమెరాలను బాత్రూముల్లో బిగించి వీడియోలు రికార్డ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ దారుణం కోల్‌కతాలో చోటుచేసుకుంది. నిందితుడు పక్కింటి బాత్రూమ్‌లో వీడియో తీస్తుండగా మహిళ గమనించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో గుట్టు బయటపడింది. స్థానికులంతా కలిసి చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే నిందితుడు కమలేష్ ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే తాను నివాసం ఉండే పక్కింట్లో మహిళలపై కన్నేసిన ఆ కామాంధుడు.. తన ఇంటిని అనుకొని ఉన్న ఇంట్లోని మహిళలు బాత్రూముల్లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రంలో మైక్రో కెమెరాలను బిగించి. వీడియోలు తీసేవాడు.

కమలేష్ చాలా రోజులుగా మహిళలకు తెలియకుండా వీడియోలు తీస్తున్నాడు. ఓ రోజు మహిళ స్నానానికి వెళ్లిన సమయంలో.. ఆ బాత్రూమ్‌లో మహిళ కెమెరాను గమనించి కేకలు వేసింది.. కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. వారు స్థానికులతో కలిసి ఇదంతా కమలేష్ పని అని పసిగట్టారు. అతడిని పట్టుకొని స్థానికులంతా కలిసి చితకబాదారు.. పోలీసుల్ని పిలిపించి అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని రిమాండ్‌కు తరలించారు. అతడి కంప్యూటర్ ను సీజ్ చేశారు.
First published: May 23, 2020, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading