• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN ARRESTED FOR ABUSIVE FAKE CALL HARASSMENT MS

బూతు బాబోయ్ బూతు.. 'కాల్' ఎత్తారో చచ్చినట్టే..

బూతు బాబోయ్ బూతు.. 'కాల్' ఎత్తారో చచ్చినట్టే..

ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల దర్యాప్తులో ఆ నంబర్ విజయ్‌దే అని తేలడంతో అతను షాక్ తిన్నాడు. సోమవారం విజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విజయ్ అరెస్ట్‌తో అల్లాదుర్గ్‌లోని పెద్ద మనుషులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Share this:
    భార్యాభర్తల పంచాయితీని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన ఆ పెద్ద మనుషులు కొన్ని నెలల పాటు నరకం చూశారు. రాత్రి, పగలు తేడా లేకుండా.. ఎప్పుడు ఫోన్ మోగినా హడలెత్తిపోయారు. కాల్ లిఫ్ట్ చేశారో ఇక అంతే సంగతి. ఆ బూతులకు చెవులు చిల్లులు పడాల్సిందే. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు.. ఏకంగా 15మంది పెద్ద మనుషులకు ఇదే తరహాలో నరకం చూపించాడు. మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

    పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన విజయ్ ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చాడు. స్థానికంగా ఓ ఇంజనీరింగ్ కంపెనీలో వెల్డర్‌గా పనిలో చేరాడు. కొంత కాలానికి మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వీరి కాపురంలో.. ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. విజయ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు.ఇదే క్రమంలో విజయ్ భార్య తన గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. దీంతో పెద్ద మనుషులు విజయ్‌ను మందలించి.. బుద్దిగా కాపురం చేసుకోవాలని చెప్పారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో.. మరోసారి పంచాయితీ పెట్టి మందలించారు. అప్పటినుంచి విజయ్ ఆ ఊరి సర్పంచ్ సహా పెద్ద మనుషులపై కక్ష పెంచుకున్నాడు.

    ఓరోజు ఎవరిదో సిమ్ కార్డు దొరకడంతో.. ఆ నంబర్‌తో అల్లాదుర్గ్ పెద్దమనుషులకు తరుచూ ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి.. వారిని నానా బూతులు తిట్టేవాడు. మొదట ఆడ గొంతుతో మాట్లాడి.. ఆపై తన గొంతుతో నోటికొచ్చినట్టు తిట్టేవాడు. ఆ బూతులకు భయపడి ఫోన్ మోగితేనే వారు హడలెత్తిపోయారు. ఇదే క్రమంలో తన భార్యకు మద్దతుగా నిలిచినందుకు సమీప బంధువుకు కూడా ఫోన్ చేసి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు.


    అయితే తనను వేధిస్తున్నది విజయే అని అతను గుర్తించలేదు. దీంతో విజయ్‌నే వెంటపెట్టుకుని సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం విజయ్ మళ్లీ అతనికి కాల్ చేసి 'నాపైనే కేసు పెడుతావా?.. నీ సంగతి తేలుస్తా? అంటూ మెసేజ్ పెట్టాడు. పోలీసుల దర్యాప్తులో ఆ నంబర్ విజయ్‌దే అని తేలడంతో అతను షాక్ తిన్నాడు. సోమవారం విజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విజయ్ అరెస్ట్‌తో అల్లాదుర్గ్‌లోని పెద్ద మనుషులు ఊపిరి పీల్చుకున్నారు.

    ఇది కూడా చదవండి : క్లాస్ రూమ్‌లో 'ముద్దు' పాఠాలు.. విద్యార్థుల బరితెగింపుకు యాజమాన్యం షాక్!
    First published:

    అగ్ర కథనాలు