చెప్పుల్లో మత్తు... తొడభాగంలో మరో 210 గ్రాములు

ఇంటెన్సివ్‌ స్క్రీనింగ్‌ అనంతరం 690 గ్రామలు మత్తపదార్ధాన్ని నిందితుని చెప్పు మధ్య భాగంలో దాచినట్లు గుర్తించారు.

news18-telugu
Updated: July 15, 2019, 11:12 AM IST
చెప్పుల్లో మత్తు... తొడభాగంలో మరో 210 గ్రాములు
చెప్పుల్లో డ్రగ్స్ సరఫరా
  • Share this:
డ్రగ్స్ సరఫరా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. . తాజాగా ఓ అంతర్జాతీయ స్మగ్లర్ చెప్పులో డ్రగ్స్ ని సరఫరా చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు జరిపిన తనిఖీల్లో  అతడు అడ్డంగా దొరికిపోయాడు.  కేరళలోని కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఓ అంతర్జాతీయ స్మగ్లర్ చెప్పులో మారిజునా అనే మత్తు పదార్థం లభించింది. స్మగ్లర్ చాలా తెలివిగా చెప్పుల్లో అడుగుభాగంలో ఈ మత్తుపదార్దాలను పెట్టుకొని రవాణా చేస్తున్నాడు. దీంతో ఆ అంతర్జాతీయ స్మగ్లర్ ని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు తాయేతూరుకు చెందిన అజాస్‌ వలియ బల్లాత్‌గా అధికారులు గుర్తించారు. కన్నూర్‌ నుండి దోహా వెళుతుండగా అజాస్‌ను పట్టుకున్నారు. తొలుత 210 గ్రాముల మత్తుపదార్థాన్ని అజాస్ తన తొడ వద్ద దాచి ఉంచినట్లు కనుగొన్నారు. ఇంటెన్సివ్‌ స్క్రీనింగ్‌ అనంతరం 690 గ్రామలు మత్తపదార్ధాన్ని నిందితుని చెప్పు మధ్య భాగంలో దాచినట్లు గుర్తించారు. దీంతో వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని... దాదాపు కిలో బరువు ఉన్న మారిజునా మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 7లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...