హోమ్ /వార్తలు /క్రైమ్ /

Extramarital Affair : పెళ్లాం ఊరెళ్లిందని ప్రియురాలిని పిలిచాడు..టూర్ క్యాన్సిల్ అయి ఇంటికి భార్య..వారిద్దరినీ నగ్నంగా..

Extramarital Affair : పెళ్లాం ఊరెళ్లిందని ప్రియురాలిని పిలిచాడు..టూర్ క్యాన్సిల్ అయి ఇంటికి భార్య..వారిద్దరినీ నగ్నంగా..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Man, Woman Paraded Naked : ఓ వివాహితుడు మరియు అతనితో ఎఫైర్(Affair) కొనసాగిస్తున్న మహిళను వివస్త్రను(Woman Stripped) చేసి గ్రామంలో నడిపించారు.

Man, Woman Paraded Naked : ఓ వివాహితుడు మరియు అతనితో ఎఫైర్(Affair) కొనసాగిస్తున్న మహిళను వివస్త్రను(Woman Stripped) చేసి గ్రామంలో నడిపించారు. జూన్ 11న ఛత్తీస్‌గఢ్‌(Chattisgarh)లోని కొండగావ్ జిల్లా ఉరిందబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూన్ 11న ఉరిందబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో పెళ్లాం ఊరెళ్లిందని భావించిన ఓ వ్యక్తి ప్రేయసిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపారు. అయితే భార్య టూర్ క్యాన్సిల్ అయి ఇంటికి తిరిగొచ్చింది. ఇంట్లో తన భర్త మరో మహిళతో నగ్నంగా ఉండటాన్ని గమనించిన ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భర్త మరో మహిళతో గదిలో శృంగారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  వెంటనే ఆ మహిళ బంధువులు,గ్రామంలోని కొందరికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు,గ్రామస్తులు...గదిలో శృంగారం చేస్తోన్న వారిద్దరినీ బయటకు లాక్కొచ్చి ఇద్దరినీ చితకబాది వారి బట్టలు ఊడదీసి అర్థనగ్నంగా గ్రామంలో ఊరేగించారు.

గ్రామంలోని కొందరు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసు బృందాన్ని గ్రామానికి పంపి విచారణ చేపట్టామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వ్యక్తి భార్యతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా..ఉరిందబెడ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 354 (స్త్రీపై దాడి లేదా నేరపూరిత బలవంతం) మరియు భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయబడిందని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.

High Court On Love: ఔను ప్రేమ గుడ్డిదే..ఆ ప్రేమికుల కేసులో హైకోర్టు తీర్పుతో తల్లిదండ్రులకు కన్నీళ్లే!

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బిలాస్‌పూర్ జిల్లా కోట గ్రామంలో పెళ్లి అయిన నెలరోజులకే అత్తింటి వరకట్న వేధింపులు తాళలేక.. నిప్పటించుకొని ఆత్మహత్య (Newly Married woman commits suicide) చేసుకుంది ఓ మహిళ. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... నాగిత అలియాస్ శ్వేత అనే యువడికి నెల రోజుల క్రితం వివాహమైంది. ఆమె తల్లిదండ్రులు ఉన్నంతలోనే ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో అల్లుడికి బైక్ ఇప్పిస్తామని ఒప్పుకున్నారు. కానీ నెల రోజులవుతున్నా.. ఇచ్చిన హామీని నెరవర్చలేదు. అతడికి బైక్‌ని కానుకగా ఇవ్వలేదు. అంతే అప్పటి నుంచి అత్తింట్లో కొత్త పెళ్లి కూతురుకు టార్చర్ మొదలయింది. బైక్ విషయమై ఆమెను అత్తమామలు వేధించేవారు. భర్త కూడా చిత్రహింసలకు గురిచేశాడు. అత్తింటికి వేధింపులను తట్టుకోలేక శ్వేత ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కొత్తగా పెళ్లైన మహిళ అగ్నిప్రమాదంలో మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. తామూ ఏమీ అనలేదని.. కారణమేంటో తెలియదు గానీ.. కొత్త కోడలు నిప్పటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తింటి వారు చెప్పారు.

Honour Killing : పెళ్లైన ఐదు రోజులకు దంపతులను దారుణంగా నరికి చంపేశారు

కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం... అత్తామామలే తమ కూతురిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. వారి ఇంట్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న శ్వేత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కిరోసిన్, అగ్గిపెట్టెను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రూరల్‌ ఏఎస్పీ రోహిత్‌ ఝా, కోట స్టేషన్‌ ఇన్‌చార్జి దినేష్‌ చంద్రను ఎస్‌ఎస్పీ పరుల్‌ మాథుర్‌ ఆదేశించారు. వివాహమైన తర్వాత బైక్ విషయంలో..భర్త, అత్తమామలు, ఇంట్లోని ఇతర వ్యక్తులు ఆమెను నిత్యం వేధిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Chatisghad, Extra marital affair, WOMAN

ఉత్తమ కథలు