తన భర్తను పెళ్లి చేసుకోలేదని యువతిపై మహిళ యాసిడ్ దాడి..

తనను పెళ్లి చేసుకోవాలంటూ రాధే అనే వ్యక్తి.. ఆ యువతిని కోరాడు. తమ పెళ్లికి తన భార్య కూడా అంగీకరించిందని, ఆమె కూడా ఓకే చెప్పిందని చెప్పాడు.

news18-telugu
Updated: July 25, 2019, 10:39 PM IST
తన భర్తను పెళ్లి చేసుకోలేదని యువతిపై మహిళ యాసిడ్ దాడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన భర్తను పెళ్లిచేసుకోవడానికి నిరాకరించిందన్న కసితో ఓ మహిళ.. మరో యువతిపై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆ భార్యాభర్తలు ఇద్దరికీ 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. రాధే అనే వ్యక్తి మూడేళ్ల క్రితం హరిద్వారా వెళ్లాడు. అక్కడ ఓ 20 ఏళ్ల యువతిని, ఆమె తండ్రిని కలిశాడు. తన సొంతూరు నైనిటాల్ అని ఘజియాబాద్‌లో భార్యతో కలసి ఉంటున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ రాధే అనే వ్యక్తి.. ఆ యువతిని కోరాడు. తమ పెళ్లికి తన భార్య కూడా అంగీకరించిందని, ఆమె కూడా ఓకే చెప్పిందని చెప్పాడు. అయితే, వారిపై అనుమానం వచ్చిన యువతి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వారు ఓ వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారని, పెళ్లి పేరుతో తనను కూడా అందులోకి లాగాలని ప్రయత్నిస్తున్నట్టు గ్రహించింది. దీంతో అతడి పెళ్లి ప్రతిపాదనను నిరాకరించింది. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ కలసి అపరిచిత వ్యక్తుల్లా ఓ కొత్త ఫోన్ నెంబర్ ద్వారా ఆ యువతికి ఫోన్ చేసి.. ఓ చోటికి రావాలని సూచించారు. దీంతో యువతి అక్కడకు వెళ్లింది. రాధే, అతడి భార్య అనిత కలసి మరోసారి ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. అయినా సరే, ఆ యువతి ససేమిరా అని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహించిన రాధే, అనిత.. తమతో తెచ్చుకున్న యాసిడ్ ‌ను ఆమె ముఖం మీద పోసి పారిపోయారు.

మూడేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటనలో ఆ యువతి ముఖం పూర్తిగా కాలిపోయింది. చేతులు కూడా దెబ్బతిన్నాయి. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితులైన భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరూ చెరో రూ.లక్ష డబ్బును బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది.

First published: July 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు