హోమ్ /వార్తలు /క్రైమ్ /

మైనర్ బాలుడితో వివాహిత రాసలీలలు...చెప్పుల దండతో ఊరేగింపు

మైనర్ బాలుడితో వివాహిత రాసలీలలు...చెప్పుల దండతో ఊరేగింపు

గ్రామంలో పంచాయతీ పెట్టి ఇద్దరినీ చితకబాదారు. మహిళతో పాటు యువకుడికి చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు.

గ్రామంలో పంచాయతీ పెట్టి ఇద్దరినీ చితకబాదారు. మహిళతో పాటు యువకుడికి చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు.

గ్రామంలో పంచాయతీ పెట్టి ఇద్దరినీ చితకబాదారు. మహిళతో పాటు యువకుడికి చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు.

పోలీసులంటే భయం లేదు. చట్టాలపై వారికి గౌరవం లేదు. తాము చెప్పిందే వేదం..చేసిందే చట్టం..! మారుమూల గ్రామల్లో ఊరి పెద్దలు, కుల పెద్దల పెత్తనమే నేటికీ కొనసాగుతోంది. అనాగరిక తీర్పులు...ఆటవిక శిక్షలతో .. అంతా నా ఇష్టమంటూ చెలరేగిపోతున్నారు. తాజాగా హర్యానాలోని కర్నాల్‌లో ఇలాంటి వ్యవహారమే ఒకటి జరిగింది. వివాహేతర సంబంధాన్ని కారణంగా చూపి ఓ యువకుడు, వివాహిత మహిళను చావబాదారు కుల పెద్దలు. అంతేకాదు చెప్పుల దండలను మెడలో వేసి గ్రామంలో ఊరేగించారు.

బీహార్‌కు చెందిన ఓ మహిళ హర్యానాలోని ధనియాల్‌పూర్ గ్రామంలో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే అదే గ్రామానికి చెందిన ఇంటర్ స్టూడెంట్‌తో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. కొంతకాలంగా ఈ తంతు సాగుతుండగా ఇటీవలే గ్రామస్తులకు తెలిసింది. దాంతో ఆ మహిళ కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో పంచాయతీ పెట్టి ఇద్దరినీ చితకబాదారు. మహిళతో పాటు యువకుడికి చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. సర్పంచ్ వద్దని వారిస్తున్నా వదలిపెట్టలేదు. అంతేకాదు ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోవాలని హుకూం జారీచేశారు.

ఊళ్లో అందరు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. కానీ ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొందరు యువకులు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడడంతో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులకు చెప్పకుండా కుల పెద్దలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వీడియో ఇక్కడ చూడండి:

First published:

Tags: Crime, Haryana

ఉత్తమ కథలు