news18-telugu
Updated: February 28, 2020, 3:30 PM IST
ఏపీలోని కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాస పురంలో ఘోరం జరిగింది. ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసి చంపాడో దుర్మార్గపు తండ్రి.
ఏపీలోని కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాస పురంలో ఘోరం జరిగింది. ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసి చంపాడో దుర్మార్గపు తండ్రి. ముందుగా ఇద్దరు కుమార్తెలతో సహా బావిలో దూకి అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు భావించారు. కానీ, కూతుళ్లను చంపి పారిపోయినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన చిన్న బాలకొండయ్య(36)కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏడాది క్రితం భార్య ఉరేసుకుంది. దీంతో అప్పటి నుంచి బిడ్డల ఆలనాపాలనా చూసేవారెవరూ లేరు. దీంతో బాలకొండయ్య తన కూతుళ్లను చంపాలని పన్నాగం పన్నాడు. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని కూతుళ్లను ఒప్పించాడు. కూతుళ్లు శోభన(11), భావన(8)తో కలిసి బావి దగ్గరికి వెళ్లి వాళ్లను తోసేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
February 28, 2020, 10:18 AM IST