అబార్షన్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటా.. ప్రియుడి కండిషన్.. కానీ చివరకు ఊహించని ట్విస్ట్

ప్రతీకాత్మక చిత్రం

అబార్షన్‌కు ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆస్పత్రి నిర్వాహకులు యువతి తరఫు వారు ఉండాలలని చెప్పారు. తానే యువతి తల్లినని యువకుడి తల్లి నమ్మించి అబార్షన్ చేయించింది. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు.

 • Share this:
  23 ఏళ్ల యువతి ఓ యువకుడితో ప్రేమతో పడింది. అతడే సర్వస్వంగా బతికింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామని..నిన్ను బాగా చూసుకుంటానని ప్రియుడు కూడా హామీ ఇచ్చాడు. పెళ్లికి ముందే వీరిద్దరు శారీరకంగా ఒక్కటవడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత ఆమెకు అసలు కష్టాలు మొదలయ్యాయి. గర్భం దాల్చానని చెప్పడంతో ముఖం చాటేశాడు. కట్నం ఇవ్వాలని.. అబార్షన్ చేసుకోవాలని కండిషన్లు పెట్టాడు. చివరకు బలవంతంగానే అబార్షన్ చేయించారు. ఐనా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆ యువతిని వివాహం చేసుకోకుండా ముఖం చాటేస్తున్నాడు. ఇలా ప్రియుడి చేతిలో మోసపోతూ వస్తున్న.. ఓ యువతి కన్నీటి గాథ ఇది. వరంగల్ జిల్లాల్లో ఇది చోటుచేసుకుంది.

  వాజేడుకు చెందిన ఓ యువతి, అదే మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు. ప్రేమిస్తున్నానని ఏడాది కాలంగా వెంటపడడంతో ఆమె కూడా పచ్చజెండా ఊపింది. ఈ ప్రేమ జంట దాదాపు ఆరు నెలల పాటు సహజీవనం చేసింది. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తన ప్రియుడికి దృష్టికి తీసుకెళ్లింది. నాకు భయంగా ఉందని.. మనం పెళ్లి చేసుకుందామని అడిగింది. సరే చేసుకుందాం.. మా తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేద్దాం.. అని అతడు నమ్మించాడు. చెప్పినట్లుగానే కొన్ని రోజులు క్రితం.. తన ఇంటికి తీసుకెళ్లి పెద్దవారితో మాట్లాడారు. ఐతే ఊరికే చేసుకోబోమని.. రూ. 5 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేస్తామని ఆ యువకుడి తల్లిదండ్రులు స్పష్టం చేశారు. వారి మాటలు విన్ని యువతి తరపు వారు షాక్ తిన్నారు. తమకు ఇద్దరూ అమ్మాయిలేనని.. ఉన్న ఆస్తి మొత్తం వారికే వస్తుంది కదా, కట్నం ఎందుకని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు మాత్రం వినలేదు.

  ఆ తర్వాత మరోసారి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అప్పుడు యువకుడు మరో కండిషన్ పెట్టాడు. అబార్షన్‌ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయమని చెప్పారు. ఐతే అబార్షన్‌కు ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆస్పత్రి నిర్వాహకులు యువతి తరఫు వారు ఉండాలలని చెప్పారు. తానే యువతి తల్లినని యువకుడి తల్లి నమ్మించి అబార్షన్ చేయించింది. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. అబార్షన్ అయినా పరావలేదు.. తన ప్రియుడు పెళ్లి చేసుకుంటే చాలని ఆ యువతి అనుకుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇవాళ, రేపు అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు.

  ఇటీవల గ్రామ సర్పంచ్‌ సమక్షంలో మరోసారి పంచాయతీ నిర్వహించారు. ఐనా యువకుడు మాటవినలేదు. చివరకు సర్పంచ్‌ సూచన మేరకు బాధిత యువతి జూలై 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ కూడా తనకు న్యాయం జరగడం లేదని యువతి వాపోతోంది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. తన గర్భానికి కారణమైన ప్రియుడితో వివాహం జరిపించాలని కోరుతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: