ఓ యువకుడు హిజ్రాపై మనసు పడ్డాడు. ఏకంగా పెద్దలను ఎదిరించి నెల రోజుల క్రితం హిజ్రాతో కలిసి వేరు కాపురం పెట్టాడు. ఏమైందో ఏమోగానీ సహజీవనం చేస్తున్న వారిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన దిలీప్(26) అనే యువకుడు నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ(30) అనే హిజ్రాతో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అనంతరం ప్రేమగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ఘాటు ప్రేమికులయ్యారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం దిలీప్ ఇంటిలో తెలిసింది. కుటుంబ సభ్యులు దిలీప్‌ను గట్టిగా మందలించారు.
షివానీ ప్రేమను వదులుకోనని, నెల రోజుల క్రితం దిలీప్ ఇల్లు వదిలి వచ్చాడు. కారైక్కాల్ ఒడుదురై ప్రాంతంలో షివానీతో వేరు కాపురం పెట్టాడు. ఇంత గాఢంగా ప్రేమించుకున్న వారు ఏమైందో తెలియదు గానీ శనివారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.