యువతిపై 14 రోజుల పాటు అఘాయిత్యం.. అందమైన ప్రదేశాలు చూపిస్తానంటూ అడవిలోకి తీసుకెళ్లి..

దేశంలో యువతులపై అఘాయిత్యాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు 20 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతిని కిడ్నాప్ చేసి అడివిలో బంధించి 14 రోజుల పాటు దారుణంగా రేప్ చేశాడు.

news18-telugu
Updated: November 27, 2020, 11:12 PM IST
యువతిపై 14 రోజుల పాటు అఘాయిత్యం.. అందమైన ప్రదేశాలు చూపిస్తానంటూ అడవిలోకి తీసుకెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో యువతులపై అఘాయిత్యాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు 20 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతిని కిడ్నాప్ చేసి అడివిలో బంధించి 14 రోజుల పాటు దారుణంగా రేప్ చేశాడు. ఎట్టకేలకు ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం.. ఓ యువతి నవంబర్9న తనకు వరుసకు మామ అయ్యే వ్యక్తి ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లింది. అయితే.. చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను చూడడానికి ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే బుండి జిల్లాకు చెందిన ఫోరులాల్ అనే వ్యక్తి ఆ విషయాన్ని గమనించాడు. ఈ చుట్టు పక్కల ఇంకా అందమైన ప్రదేశాలు ఉన్నాయని మాయ మాటలు చెప్పాడు. తనతో బయటకు వస్తే వాటిని చూపిస్తానని నమ్మబలికాడు.

అతని మాయ మాటలు నమ్మిన ఆ యువతి ఆ వ్యక్తి మోటారు సైకిల్‌ ఎక్కింది. దీంతో అతను ఆ యువతిని కోట జిల్లాలోని మందనాకు దగ్గరలో ఉండే ఓ అడవికి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఫోరులాల్ ఆ యువతిని కట్టేశాడు. 14 రోజుల పాటు ఆమెపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే 14 రోజుల తర్వాత ఫోర్ లాల్ ఆ యువతిని అక్కడే ఉంచి బయటకు వెళ్లాడు. దీంతో ఆ యువతి పడేసిన తన మొబైల్ ను వెతికి తన తండ్రికి ఫోన్ చేసింది. తండ్రికి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది.

దీంతో బాధితురాలి తండ్రి ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లి కూతురును తీసుకెళ్లాడు. దీంతో ఆ యువతి తండ్రితో కలిసి వెళ్లి బారన్ జిల్లాలోని ఆంటా పోలీస్ స్టేషన్‌లో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్టేషన్ ఆఫీసర్ ఉమేష్ మనరియా వెల్లడించారు. ఆరోగ్య పరీక్షల కోసం బాధితురాలిని హాస్పటల్ కు తరలించినట్లు వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Published by: Nikhil Kumar S
First published: November 26, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading