సికింద్రాబాద్ అపార్ట్‌మెంట్‌లో దారుణం... చిన్నారిని చితకబాదిన ఓ పెద్దాయన

మరోవైపు అపార్ట్‌మెంట్ వాసులు కూడా కాంతారావు వైఖరిపై మండిపడుతున్నారు. చిన్నారిని అంతలా కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: November 11, 2019, 12:03 PM IST
సికింద్రాబాద్ అపార్ట్‌మెంట్‌లో దారుణం... చిన్నారిని చితకబాదిన ఓ పెద్దాయన
చిన్నారిని కొడుతున్న కాంతారావు
  • Share this:
సికింద్రాబాద్‌ అల్వాల్‌లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కాంతారావు అనే వ్యక్తి ఓ బాలుడ్ని విచక్షణారహితంగా చావబాదాడు. కారుకు అడ్డంగా వచ్చాడని చిన్నారి అని చూడకుండా పిడిగుద్దులు కురిపించాడు. గాల్లో ఎత్తిమరి చిన్నారిపై తన ప్రతాపం చూపించాడు. చిన్నారిని కాంతారావు... దారుణంగా కొట్టడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే... కాంతారావు దెబ్బలకు బెదిరిపోయే... ఒళ్లంతా నొప్పులతో చిన్నారి ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడు తండ్రి కాంతారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు అపార్ట్‌మెంట్ వాసులు కూడా కాంతారావు వైఖరిపై మండిపడుతున్నారు. చిన్నారిని అంతలా కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని సముదాయించాల్సిన పెద్ద మనిషి ఇలా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంతారావుపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>