• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN AGED 45 LIVEIN RELATIONSHIP WITH WOMAN AGED 65 KILLED HER IN SURAT OF GUJARAT AK

ఆమెకు 65, అతడికి 45.. మూడేళ్లుగా సహజీవనం.. సడెన్‌గా ఒక రోజు ఏం జరిగిందంటే..

ఆమెకు 65, అతడికి 45.. మూడేళ్లుగా సహజీవనం.. సడెన్‌గా ఒక రోజు ఏం జరిగిందంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

45 ఏళ్ల వ్యక్తి 65 ఏళ్ల మహిళతో మూడేళ్ల నుంచి సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇది గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.

  • Share this:
    వివాహేతర సంబంధాలు కొనసాగించే వాళ్లు వయస్సును పెద్దగా పట్టించుకోవడం లేదని అనేక సంఘటనలు చెప్పకనే చెప్పాయి. అలాంటి ఓ సంఘటనలో 45 ఏళ్ల వ్యక్తి 65 ఏళ్ల మహిళతో మూడేళ్ల నుంచి సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇది గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది. ఈ విషయం అక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్లందరికీ తెలుసు. అయితే వాళ్లిద్దరికీ లేని ఇబ్బంది తమకెందుకు అని చాలామంది ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అయితే ఓ రోజు సడెన్‌గా 65 ఏళ్ల మహిళ చనిపోవడం కలకలం రేపింది. అనారోగ్యం కారణంగా ఆమె చనిపోయిందని.. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పోలీసులకు తెలిపాడు.

    పోలీసులు కూడా మొదట అతడు చెప్పిందే నమ్మారు. అయితే ఆమె మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది. గాయాల కారణంగానే ఆమె చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టు స్పష్టం చేయడంతో.. పోలీసులు ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న వారికి విచారించారు. దీంతో అంతకుముందు రోజు తాగొచ్చి.. బాధితురాలిని నిందితుడు కొట్టాడని స్థానికులు తెలిపారు.

    తమకు అంతవరకే తెలుసని.. ఆ తరువాత ఏ జరిగిందో తెలియదని అన్నారు. దీంతో నిందితుడు కొట్టిన దెబ్బల కారణంగానే బాధితురాలు మరణించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు అసలు ఈ ఇద్దరు సహజీవనం చేయడానికి కారణలేంటి ? ఎంతకాలంగా ఈ ఇద్దరు ఇలా చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. నిందితుడికి అంతకముందు ఏదైనా నేరచరిత్ర ఉందా ? అని విచారణ చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు