MAN AGED 25 YEARS FIND HER GIRL FRIEND CHEATING ONE DAY BEFORE OF PROPOSAL AK
GirlFriend Cheating: తెల్లారితే గర్ల్‌ఫ్రెండ్‌కు రూ. 4 కోట్ల రింగ్ ఇవ్వాల్సింది.. కానీ ఇంతలోపే..
ప్రతీకాత్మక చిత్రం
GirlFriend Cheating: బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల మేఫెయిర్ అనే వ్యక్తి.. తన స్నేహితురాలితో ఆరు నెలల నుంచి రిలేషన్లో ఉన్నాడు. ఈ సమయంలో ఆమెతో కలిసి ఎంతో మధురమైన క్షణాలను గడిపాడు. ఆమె ప్రేమను ఎంతగానో ఆస్వాదించాడు.
తన ప్రియురాలిని అతడు ఎంతగానో ప్రేమించాడు. ఆమె మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన మీద ఆమె చూపిస్తున్న ప్రేమ అంతా నిజమని అతడు గట్టిగా నమ్మాడు. త్వరలోనే ఆమెకు తన ప్రేమను తెలియజేయాలని భావించాడు. ఇందుకోసం ఓ భారీ గిఫ్ట్‌ను కూడా రెడీ చేసుకున్నాడు. తెల్లారితే తన ప్రియురాలికి తాను తీసుకొచ్చిన భారీ గిఫ్ట్ ఇచ్చి.. తన ప్రేమను వ్యక్తం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఇంతలోనే అతడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అతడి మనసు విరిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల మేఫెయిర్ అనే వ్యక్తి.. తన స్నేహితురాలితో ఆరు నెలల నుంచి రిలేషన్లో ఉన్నాడు. ఈ సమయంలో ఆమెతో కలిసి ఎంతో మధురమైన క్షణాలను గడిపాడు. ఆమె ప్రేమను ఎంతగానో ఆస్వాదించాడు.
ఆమె చూపించిన ప్రేమను చూసి ఇక లైఫ్ ఆమెతోనే ఫిక్స్ అయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఖరీదైన గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఏకంగా రూ. 4 కోట్ల విలువైన ఫ్లాటినమ్ రింగ్‌ను ఆమె కోసం కొనుగోలు చేశాడు. ఆ రింగ్ ఆమెకు ఎప్పుడెడుప్పుడు ఇద్దామా ? అని ఎదురుచూడటం మొదలుపెట్టాడు. తెల్లవారితే తన స్నేహితురాలి చేతికి ఉంగరం తొడిగి తన మనసులోని మాటను చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. అతడికి ఏమనిపించిందో ఏమో కానీ.. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి.. తన స్నేహితురాలి అకౌంట్‌ను చూశాడు.
అంతే.. ఒక్కసారిగా అతడి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. గుండె ఆగిపోయింది. అందులో తన స్నేహితురాలు మరో వ్యక్తి కోసం రొమాంటిక్ పోస్టు పెట్టింది. అతడితో కలిసి చాట్ కూడా చేసింది. వాళ్లిద్దరూ ఈ చాటింగ్‌లో తాము ఎఫ్పుడెప్పుడు కలుసుకున్న విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు. బాధితుడు మేఫెయిర్ మరింతగా కుంగిపోయే విషయం ఏమిటంటే.. అతడిని తన స్నేహితురాలు కొత్త భాయ్‌ఫ్రెండ్‌కు తన మాజీ ప్రియుడు అని చెప్పింది. ఇదంతా మేఫెయిర్తో ఆమె రిలేషన్లో ఉండగానే జరిగింది. దీంతో తన స్నేహితురాలు తనకు చేసిన మోసాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆమెతో రిలేషన్ కొనసాగించడం సరికాదని ఓ నిర్ణయానికి వచ్చేశాడు.
ఈ క్రమంలో తన స్నేహితురాలు తనతో ఏ విధంగా షాపింగ్ చేయించేది.. ఎంత ఖరీదైన బహుమతులను తన ద్వారా సొంతం చేసుకుందనే విషయాలను అతడు గుర్తు చేసుకున్నాడు. అయితే ఆమెతో బ్రేకప్ చేసుకోవాలని డిసైడయిన మేఫెయిర్.. ఆమెతో ఈ విషయాలను ఏ మాత్రం ప్రస్తావించలేదు. ఆమెకు గుడ్ బై చెప్పి.. మళ్లీ ఆమెను ఎప్పుడూ కలవలేదు. అయితే ఒక్క రోజు గడిస్తే.. తన స్నేహితురాలికి రూ. 4 కోట్ల రింగ్ ఇవ్వాల్సి వచ్చేదని మేఫెయిర్ గుర్తు చేసుకున్నాడు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.