సినిమా అవకాశాలు ఇప్పిస్తానని యువతిని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి...

సినిమా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పూనేకు శివారులోని ఓ గెస్ట్ హౌస్ కు యువతిని రమ్మన్నాడు. అయితే అతడి మాటలకు మోసపోయిన యువతి ఒంటరిగా వెళ్లింది.

news18-telugu
Updated: October 8, 2019, 10:41 PM IST
సినిమా అవకాశాలు ఇప్పిస్తానని యువతిని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ అసిస్టెంట్ డైరక్టర్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే పూనేకు చెందిన ఓ యువతి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వికాస్ అనే ఓ సినిమా అసిస్టెంట్ ఆమెపై కన్నేశాడు. సినిమా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పూనేకు శివారులోని ఓ గెస్ట్ హౌస్ కు యువతిని రమ్మన్నాడు. అయితే అతడి మాటలకు మోసపోయిన యువతి ఒంటరిగా వెళ్లింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించకుండా ఉండేందుకు సినిమా చాన్సులు ఇప్పిస్తానని, పెళ్లి సైతం చేసుకుంటానని నమ్మించాడు. అయితే చివరికి అతడు ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>