MAN ACCUSED OF DOMESTIC VIOLENCE THRASHES COP INSIDE POLICE STATION IN UTTAR PRADESH MIANPURI PAH
సహానం కోల్పోయిన వ్యక్తి.. పోలీసును స్టేషన్ లోనే చితకబాదాడు.. వీడియో వైరల్..
కంట్రోల్ తప్పి పోలీసులపై దాడిచేస్తున్న వ్యక్తి
Uttar pradesh: ఒక వ్యక్తి కాపురంలో గొడవలు చెలరేగాయి. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరిని పోలీసులు కౌన్సెలింగ్ కు పిలిచారు. ఈ క్రమంలో అతగాడు కంట్రోల్ తప్పాడు.
పెళ్లాయ్యాక భార్య భర్తల మధ్య కొద్ది పాటి గొడవలు, (Family disputes) మనస్పర్థలు రావడం మాములే. దీన్ని మాట్లాడుకుని సాల్వ్ చేసుకొవాలి. ఇంట్లో పెద్ద వారికి తమ మధ్య గొడవల గురించి చెప్పాలి. దానికి వారు చెప్పే పరిష్కారాన్ని పాటించాలి. అయితే, భార్యభర్తలు మాత్రం ఈగోలకు పోకూడదు. గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గితే .. కాపురం నిలబడుతుంది. ఇద్దరు పొట్లాడితే... కుటుంబపు పరువు బజారున పడుతుంది. కొంత మంది మాత్రం.. అన్ని తమకు నచ్చినట్లే జరగాలి.. అలాగే ఉండాలని అనుకుంటారు. పుట్టిన ఇంట్లో ఇవన్ని జరుగుతాయి. కానీ అత్తింట్లో పద్దతులు, ఆచారాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే గొడవలు జరుగుతాయి. కొన్ని సార్లు.. ఈ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) విచిత్రమైన ఘటన జరిగింది. మియాన్ పూర్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఒక యువకుడి ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. దీంతో అతని భార్య గృహ హింస కేసు పెట్టింది. దీంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఇంతలో అతను కంట్రోల్ తప్పాడు. పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టాడు.
#WATCH | Young man loses temper, beats police official inside a police station premises in Mianpuri UP. He had been called for counselling in connection with another case.
అంతటితో ఆగకుండా, పోలీసును కాలర్ పట్టుకుని లాగిపెట్టి కొట్టాడు. అడ్డుకోబోయిన లేడీ పోలీసుపై కూడా దాడికి ప్రయత్నించారు. అయితే, పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు. కేసులను నమోదు చేశారు. అతని కుటుంబ సభ్యులు మాత్రం.. అనారోగ్యం,మానసిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వలన ఇలా ప్రవర్తించాడని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట (Social media) వైరల్ గా (viral video) మారింది.
ఇదిలా ఉండగా జార్ఖండ్ లో (Jharkhand) దారుణ ఘటన జరిగింది.
డిప్యూటి కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. దీనికి జార్ఖండ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, కొంత మంది ఇంజనీరింగ్ విద్యార్థినులు, మరికొంత మంది అతిథులు హజరయ్యారు. అందరు పార్టీలో హుషారుగా పాల్గోన్నారు. మద్యం తాగారు. అయితే, కలెక్టర్, విద్యార్థి సింగిల్ గా ఉండటాన్ని చూశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను లైంగికంగా (harassment) వేధించాడు.
అయితే, యువతి ఇంటికి వెళ్లి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో సోమవారం.. తనపై కలెక్టర్ లైంగిక వేధింపులకు (female harassment) పాల్పడ్డాడని ఖుంటీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పార్టీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పార్టీకి వచ్చిన ఇతరులకు కూడా విచారించారు. ప్రాథమికంగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమేనని వారు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.