రేప్ కేసులో నిందితుడు... పోలీస్ కస్టడీలో ఆత్మహత్యకు యత్నం...

Chandigarh : రాజేష్ కుమార్... రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. డేరాబస్సీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మరి రాజేష్ ఎందుకు సూసైడ్ చేసుకోబోయాడు?

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 2:28 PM IST
రేప్ కేసులో నిందితుడు... పోలీస్ కస్టడీలో ఆత్మహత్యకు యత్నం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జైల్‌లోని వాష్‌రూంలో ఒక్కసారిగా గాజు సీసా బద్ధలైన శబ్దం వచ్చింది. డ్యూటీలో ఉన్న పోలీసులు... వాష్ రూం తలుపు తెరచి చూశారు. రేప్ కేసులో నిందితుడైన రాజేష్ కుమార్... ఓ మూల కూలబడి ఉన్నాడు. అతని తలపై నుంచీ రక్తం బొటబొటా కారుతోంది. అతని చేతిలో పగిలిన గాజు బాటిల్ ఉంది. కొన్ని గాజు పెంకులు కింద పడివున్నాయి. పోలీసులు వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. అతను సూసైడ్‌కి యత్నించాడంటూ... అతనిపై సెక్షన్ 309 కింద మరో FIR నమోదు చేశారు. అసలేమైందని రిపోర్టర్లు గుచ్చి గుచ్చి అడిగారు పోలీసుల్ని. అప్పుడు ఎస్సై ఏం జరిగిందో చెప్పాడు. కోర్టు నుంచీ రాజేష్‌ను పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చాక... అతను వాష్‌రూంకి వెళ్తానని అన్నాడు. ఓ కానిస్టేబుల్‌ని వెంట పంపించాడు ఎస్సై. కానిస్టేబుల్ వాష్‌రూం బయట నిలబడి... నువ్వు లోపలికి వెళ్లు... డోర్ క్లోజ్ చేసినా... గడియ మాత్రం పెట్టకూడదు అని కండీషన్ పెట్టాడు. లోపలికి వెళ్లిన రాజేష్ కుమార్... అక్కడున్న బాటిల్‌ని పగలగొట్టి చనిపోవడానికి యత్నించాడని ఎస్సై వివరించారు.

ఆగస్ట్ 14న రాజేష్‌ని అరెస్ట్ చేశారు. ఓ రేప్ కేసులో అతనిపై ఆరోపణలున్నాయి. అతను అత్యాచారానికి పాల్పడటం వల్లే... చేసిన తప్పుకి శిక్షగా చావాలని ప్రయత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాజేష్ తలకు గాయమైందనీ, అది తగ్గిన తర్వాత... అతన్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>