ముస్లిం మహిళను బురఖా తీయమన్న డాక్టర్... అరగంట తర్వాత...

వైద్యానికి వచ్చిన ఓ ముస్లిం మహిళ బురఖా తీయమన్నందుకు చిక్కుల్లో ఇరుక్కున్న ఇంగ్లండ్ డాక్టర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 19, 2019, 3:17 PM IST
ముస్లిం మహిళను బురఖా తీయమన్న డాక్టర్... అరగంట తర్వాత...
వైద్యం కోసం మహిళను బురఖా తీయమన్న డాక్టర్... అరగంట తర్వాత...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 19, 2019, 3:17 PM IST
వైద్యానికి వచ్చిన ఓ ముస్లిం మహిళ బురఖా తీయమన్నందుకు ఓ డాక్టర్ చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్‌లోని రాయల్ స్ట్రోక్ యూనివర్సిటీలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాయల్ స్ట్రోక్ యూనివర్సిటీలోని కన్సల్టింగ్ గదిలోకి వైద్యం కోసం ముగ్గురు వచ్చారు. అయితే అందులో ఓ మహిళ బురఖా ధరించి ఉండడంతో ఆమె చెబుతున్న మాటలు డాక్టర్ కీథ్ వోల్వర్‌సన్‌కు అర్థం కాలేదు. దాంతో బురఖా తీసి మాట్లాడమని ఆమెను ఎంతో సున్నితంగా కోరాడు డాక్టర్ కీథ్ వోల్వర్‌సన్. దానికి ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా బురఖా తీసి తన సమస్యను డాక్టర్‌కు వివరించింది. ఆమ సమస్యను తీరిగ్గా విన్న డాక్టర్ మందులు రాసి పంపించివేశాడు. అయితే ఆమె వెళ్లిన అరగంట తర్వాత మహిళ భర్త ఆసుపత్రికి వచ్చాడు. తన భార్య బురఖా లేకుండా ఉండడం చూసి షాకయ్యాడు. ఎందుకు బురఖా తీసి వేశావని ఆమెను ప్రశ్నించాడు. దాంతో ఆమె మాట మార్చి... తాను తీయనని చెప్పినా డాక్టర్ బలవంతంగా బురఖా విప్పించాడని... తనతో చాలా అసభ్యంగా వ్యవహారించాడని చెప్పింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మహిళ భర్త... డాక్టర్‌పై యూనివర్సిటీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న సీనియర్ డాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు రెఢీ అయ్యారు అధికారులు.

డాక్టర్ చర్యలు జాత్యాహంకారానికి నిదర్శనమంటూ మహిళ, ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. బురఖాలో ఉన్న మహిళ చెప్పిన మాటలు అర్థం కాకపోతే మహిళా వైద్యురాలికి అప్పగించాల్సిందని... బురఖా తీయమనడం సమంజసం కాదని ప్రశ్నించారు అధికారులు. దాంతో ఏం చేయాలో తెలియక బురఖా తీయమనడం ఇన్ని సమస్యలు తెస్తుందనుకోలేదని అధికారుల ముందు వాపోయాడు 23 ఏళ్ల అనుభవం గలిగిన సదరు డాక్టర్.


First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...