నేను చావాలా? బతకాలా? ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పోల్.. రిజల్ట్ చూసి..

ఆ పోస్ట్ చూసిన వారిలో చాలా మంది.. చావు ఎందుకు అని హెచ్చరించాల్సిందిపోయి చచ్చిపో అంటూ ఓటు వేశారు. అలా 60 శాతం మంది ఆమెను చనిపోవాలని ప్రోత్సహించారు.

news18-telugu
Updated: May 15, 2019, 4:22 PM IST
నేను చావాలా? బతకాలా? ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పోల్.. రిజల్ట్ చూసి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 15, 2019, 4:22 PM IST
ఓ వ్యక్తి చనిపోతున్నాడంటే.. ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తాం. చచ్చి ఏం సాధిస్తావ్.. బతికి సాధించు అని జ్ఞానబోధ చేస్తాం. కానీ, మలేషియాలో చచ్చిపో అంటూ ప్రోత్సహించారు కొందరు. అదీ ఓ 16 ఏళ్ల అమ్మాయిని. వివరాల్లోకెళితే.. ఓ అమ్మాయి ‘చాలా ముఖ్యమైన అంశం ఇది. నేను చచ్చిపోవాలా?బతికి ఉండాలా? సహాయం చేయండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి పోల్ నిర్వహించింది. ఆ పోస్ట్ చూసిన వారిలో చాలా మంది.. చావు ఎందుకు అని హెచ్చరించాల్సిందిపోయి చచ్చిపో అంటూ ఓటు వేశారు. అలా 60 శాతం మంది ఆమెను చనిపోవాలని ప్రోత్సహించారు. కాసేపటికి ఆ రిజల్ట్ చూసిన ఆ యువతి బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయింది. ఈ దారుణ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అయితే, ఆ యువతి ఎందుకు చావాలనుకున్నది తెలియరాలేదు.

దీనిపై ఆ దేశ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, పైగా ఆమె ఆత్యహత్యకు పలువురు ప్రోత్సహించడం నేరమని తెలిపింది. కాగా, మలేషియా చట్ట ప్రకారం మైనర్లను ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపిస్తే వారికి మరణ శిక్ష లేదా 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అంటే.. చావాలని ఆమెను ప్రోత్సహించిన వారందరికీ శిక్ష పడటం ఖాయం అన్నమాట. మరోవైపు, ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌ను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...