లోదుస్తుల్లో సంచి... అందులో కళ్లు జిగేల్ మనేలా వజ్రాలు...

కుక్కర్‌ను పరిశీలించగా అందులోనూ వజ్రాలు కనిపించాయి. కుక్కర్ అంతర్భాగంలో ఓ సంచిలో దాచిపెట్టిన వజ్రాలు బయపడ్డాయి. అ

news18-telugu
Updated: August 4, 2019, 9:09 AM IST
లోదుస్తుల్లో సంచి... అందులో కళ్లు జిగేల్ మనేలా వజ్రాలు...
కుక్కర్‌ను పరిశీలించగా అందులోనూ వజ్రాలు కనిపించాయి. కుక్కర్ అంతర్భాగంలో ఓ సంచిలో దాచిపెట్టిన వజ్రాలు బయపడ్డాయి. అ
  • Share this:
వజ్రాలు ఎక్కడ చూసినా కళ్లు మిరిమిట్లు గొలిపేలా మెరిసిపోతుంటాయి. అలాంటిది ఒకేసారి కోట్లు విలువ చేసే వజ్రాలు కనిపిస్తే ఎలా ఉంటుంది. చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ సిబ్బందికి అలాంటి అనుభవమే కలిగింది. మలేషియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు చెన్నై విమానాశ్రయంలో రెండు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలతో దొరికిపోయాడు. అజ్మల్ ఖాన్ నాగూర్ మీరా అనే 48 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. కస్టమ్స్ అధికారులు అతడి లగేజీని తనిఖీ చేయగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. దీంతో అతడ్ని బాడీ స్కాన్ చేశారు.

బాడీ స్కాన్‌లో అజ్మల్ లోదుస్తుల్లో ఓ సంచిని గుర్తించారు అధికారులు. సంచిలో ఉన్నవజ్రాల్ని చూసి షాక్ తిన్నారు. అందులోని వజ్రాలను చూసి ఆశ్చర్యపోయారు. వాటి విలువ రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అలాగే అజ్మల్ తీసుకొచ్చిన కుక్కర్‌ను పరిశీలించగా అందులోనూ వజ్రాలు కనిపించాయి. కుక్కర్ అంతర్భాగంలో ఓ సంచిలో దాచిపెట్టిన వజ్రాలు బయపడ్డాయి. అజ్మల్ నుంచి మొత్తం రూ. 2.25 కోట్ల విలువైన 2996 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాటిని ఎవరి కోసం తీసుకొచ్చాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. అజ్మల్‌ కోసం ఎవరైనా వస్తారేమోనని పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. అతడిని విమానాశ్రయం బయట నిల్చోబెట్టి వజ్రాల కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూశారు. చాలాసేపు ఎదురుచూసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో అజ్మల్‌ను వెనక్కి తీసుకెళ్లారు.


First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...