Remya Suresh: మార్ఫింగ్ పోర్న్ వీడియో వైరల్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి.. ఎమోషనల్ పోస్ట్

రమ్యా సురేష్

నెట్టింట్‌లో వైరల్‌గా మారిన మార్ఫ్‌డ్ పోర్న్ వీడియోను చూసి ప్రముఖ నటి రమ్యా సురేష్‌ షాక్ తిన్నారు. ఆ వీడియోలు ఉన్న అమ్మాయికి ఆమె దగ్గరి పోలికలు ఉండటమే ఇందుకు కారణం. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఆమె చెప్పారు.

  • Share this:
    తన పేరు‌తో మార్ఫింగ్ పోర్న్ వీడియో, ఫొటోలు వైరల్‌ కావడంతో ప్రముఖ మలయాళ నటి రమ్యా సురేష్ షాక్ తిన్నారు. ఇందుకు సంబంధించి ఆమె సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించారు. ఫ్రెండ్ ద్వారా ఈ వైరల్ వీడియో గురించి తెలిసిందని రమ్య అన్నారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఇలా చేయడం వల్ల తన మానసికంగా దెబ్బతిన్నానని అన్నారు. ‘ఇంటర్నెట్‌లో వైరలవుతన్న పోర్న్‌ వీడియోలో ఉంది నేను కాదు. అసలు ఈ వీడియో గురించి నాకు తెలియదు. ఓ ఫ్రెండ్ చెప్పడంతో ఆ వీడియోను నేను చూశాను. అది చూసి నేను షాక్ తిన్నాను. ఎందుకంటే వీడియోలో ఉన్న యువతికి, నాకు చాలా పోలికలున్నాయి. అది చూసిన చాలా మంది ఆ వీడియోలో ఉంది నేనే అనుకుంటారు. నా గురించి బాగా తెలిసిన వారు మాత్రమే అందులో ఉన్నది నేను కాదని గుర్తించగలరు. మిగతావారు అది నేనే అని నమ్మే అవకాశం ఉంది. ఆ వీడియోను షేర్ చేయడం ఆపండి’ అని రమ్య కోరారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

    ‘ఎంతమంది ఈ వీడియో చూశారో నాకు తెలియదు. ఆ వీడియో క్లిప్‌లో ఉంది నేను కాదని ప్రతి ఒక్కరికి ఎలా చెప్పగలను. ఈ వీడియో నా మానసిక ప్రశాంతతను దెబ్బతీసింది. ఆ వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి హానికరమైన కంటెంట్‌ను ఉంచడం ద్వారా ఎలా ఆనందం పొందుతారో నాకు అర్థం కావడం లేదు. నా భర్త విదేశాల్లో పనిచేస్తున్నారు. ఆయన నాకు ఫోన్ చేసి ఓదార్చారు. అవకాశాల కోసం ఎలాంటి పనులైన చేసే వ్యక్తిని నేను కాదని వారు గుర్తుంచుకోవాలి’అని రమ్య అన్నారు.

    ఇక, మార్ఫింగ్ వీడియోలకు సంబంధించి అలప్పుజా ఎస్పీ కార్యాలయంలో రమ్య తొలుత ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సైబర్ సెల్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు అందజేశారు. తనకు పోలీసు అధికారులు చాలా మద్దతుగా ఉన్నారని రమ్యా సురేష్ తెలిపారు. వారు వెంటనే ఈ కంటెంట్ షేర్ చేసిన వాట్సాప్ గ్రూప్ డేటా సేకరించారని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: