MAKING A VIDEO OF A GIRLFRIEND BY SEXUALLY ABUSING HER IN A LOVE AFFAIR WAS COSTLY TO A YOUNG MAN SSR
Shocking: ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఈ యువకుడి ప్రాణం ఇలా పోతుందని అస్సలు అనుకుని ఉండడు..
సోనూ గుప్తా (ఫైల్ ఫొటో)
బీహార్‌లో గయా జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. తన చెల్లితో గడిపిన వీడియోలను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ యువకుడిని ఆ యువతి సోదరుడు హత్య చేసిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. Making a video of a girlfriend by sexually abusing her in a love affair was costly to a young man. When the girlfriend's brother came to know about this, he hatched such a conspiracy to murder, knowing that everyone was stunned
గయా:బీహార్‌లో(Bihar) గయా జిల్లాలో (Gaya District) ఓ యువకుడి హత్య (Murder) కలకలం రేపింది. తన చెల్లితో గడిపిన వీడియోలను (Videos) అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ (Blackmail) చేస్తున్న ఓ యువకుడిని ఆ యువతి సోదరుడు హత్య చేసిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని విష్ణుపాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చాంద్చౌరా (Chand Chaura) ప్రాంతానికి చెందిన సోనూ గుప్తా అనే యువకుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను (Fast Food Centre) నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఇతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా (Love) మారింది. ఇద్దరూ సినిమాలకు, షికార్లకు కూడా వెళ్లేవారు. ఆ క్రమంలో తన ప్రేయసిని రూంకు తీసుకెళ్లి ఆమెతో సోనూ గుప్తా శారీరకంగా కలిశాడు. ఇలా పలుమార్లు ఇద్దరూ సెక్స్‌లో పాల్గొన్నారు. అయితే.. ఇటీవల ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో సోనూ గుప్తా తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీశాడు.
వీడియో తీయవద్దని ఆ యువతి ఎంత వారించినా వినలేదు. కేవలం తాను చూసుకోవడానికేనని.. చూసిన వెంటనే డిలీట్ చేస్తానని ఆ యువతిని నమ్మించాడు. ఆమె అతని మాటలు నమ్మడమే తప్పయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ యువతిని డబ్బు కోసం సోనూ గుప్తా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా అడిగినప్పుడల్లా డబ్బులిచ్చిన ఆ యువతి ఒకానొక సమయానికి విసిగిపోయింది. తన ప్రియుడు చేసిన మోసాన్ని సోదరుడికి చెప్పుకుని భోరున విలపించింది. తన చెల్లిని ఇంతలా ఇబ్బంది పెట్టిన సోనూ గుప్తాను ఊరికే వదలకూడదని ఆ యువతి అన్నయ్య మంగళ్ భావించాడు. తన స్నేహితుడు సింతూ కుమార్‌తో కలిసి సోనూ గుప్తా హత్యకు ప్లాన్ చేశాడు. చెల్లిని మోసం చేయాలనుకున్న వ్యక్తికి బుద్ధి చెప్పాలని అన్నయ్య భావించడంలో తప్పు లేదు కానీ చంపితే తాను నేరస్తుడిని అవుతానన్న చిన్న లాజిక్‌ను గ్రహించలేకపోయాడు. అనుకున్నట్టుగానే స్నేహితుడితో కలిసి సోనూ గుప్తా హత్యకు మంగళ్ పక్కా ప్లాన్ వేశాడు.
నవంబర్ 16న సోనూ గుప్తా తన పని ముగించుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళుతుండగా.. అతనిని మంగళ్, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఎవరూ చూడకుండా పక్కకు లాక్కెళ్లిపోయారు. తొలుత కడుపులో పొడిచారు. ఆ తర్వాత సోనూ గుప్తా గొంతు కోశారు. ఈ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆ యువతి సోదరుడే నిందితుడని.. అతనికి తన స్నేహితుడు సహకరించాడని తేల్చారు. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే.. సోనూ గుప్తా చేసింది కూడా తప్పే కనుక యువతులు ఇలాంటి యువకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి.. ఆమెతో శృంగారం చేస్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీయడమే కాకుండా వాటిని అడ్డం పెట్టుకుని ఆ యువతిని బ్లాక్మెయిల్ చేసిన సోనూ గుప్తా జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.