MAJOR ROAD ACCIDENT IN BIHAR PURNIA 8 PEOPLE DIED SEVERAL INJURED PVN
Accident : లారీ బోల్తా..8మంది వలస కూలీలు దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
Purnia Road Accident : బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Purnia Road Accident : బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్ణియా జిల్లాలోని జాలాల్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సిలిగురి నుంచి జమ్మూకు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులందరూ రాజస్తాన్ కు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు మాత్రం అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు తెలిపారు. అతని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ఘటనలో మరణించినవారంతా రోజూ కూలీ పని చేసుకుని జీవనం సాగించే వారేనని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు,ఢిల్లీలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ఇంటిని విషవాయువులతో నింపేసి.. అవి బయటకు వెళ్లకుండా.. పూర్తిగా మూసేసి.. ఆ తర్వాత ఊపిరాడకుండా చేసుకొని.. మరణించారు. ఒళ్లు గొగుర్పొడిచే ఈ ఘటన ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్ విహార్ (Vasant vihar suicide case)కు చెందిన మంజు, ఉమేష్ చంద్ర శ్రీవాస్తవ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు అనిక, అంకూ. ఉమేష్ గత ఏడాది కరోనాతో మరణించారు.
అప్పటి నుంచీ తల్లీకూతుళ్లే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో.. శనివారం రాత్రి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడం.. బయట కిటికీలు పాలిథీన్ కవర్లతో మూసేసి ఉండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తలుపులన్నీ లోపలి నుంచి గడియ పెట్టుకొని ఉన్నాయి. ఎంతసేపు డోర్ కొట్టినా.. ఎవరూ బయటకు రాలేదు. పోలీసులు డోర్లు బద్ధలు కొట్టుకొని లోపలికి వెళ్లారు. బెడ్రూమ్లో తల్లీకూతుళ్లు విగతజీవులుగా పడి ఉన్నారు. వారంతా విషవాయువులతో ఊపిరాడక మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.