Home /News /crime /

MAIN NAHI GIRUNGI DRUNK OFFICER BULLIES COPS IN UP PROBE ORDERED AFTER VIDEO GOES VIRAL PAH

Shocking: తప్ప తాగి నడి రోడ్డు మీద మహిళా అధికారిణి హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో..

పోలీసులతో గొడవ పడుతున్న అధికారిణి

పోలీసులతో గొడవ పడుతున్న అధికారిణి

Uttar pradesh: మద్యం మత్తులో ఒక మహిళా అధికారిణి రోడ్డు మీద రెచ్చిపోయింది. నడి రోడ్డు మీద తూలుతు.. న్యూసెన్స్ క్రియేట్ చేసింది. ఆమెను తరలించడానికి వచ్చిన అధికారులకు చుక్కలు చూపించింది.

Drunk Officer Bullies Cops In Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ లో మహిళా అధికారిణి పీకల దాక  మద్యం తాగింది. ఆ తర్వాత.. రోడ్డు మీద బీభత్సం చేసింది. కాగా, సదరు ఘటన ఏప్రిల్ 7 నాడు జరిగినట్లు తెలుస్తోంది.ఇప్పుడు ఘటకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇది వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న.. బహ్రైచ్ జిల్లాలో కేశర్వాణి అనే మహిళ డిప్యూటి లేబర్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆమె లక్నో నుంచి గోండాలోని తన కార్యాలయానికి తన సొంత కారులో వెళ్తున్నారు.

అయితే, ఆమె కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అప్పుడు పోలీసులు ఆమెను దగ్గరకు వెళ్లి చూశారు. ఆమె పీకల దాక తాగి ఉంది. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తాను డిప్యూటి లేబర్ కమిషనర్ అని.. మీ అధికారితో మాట్లాడుకుంటానని వారితో అమర్యాదగా మాట్లాడింది.





దీంతో వారు.. ఒక కానిస్టేబుల్ తో కారులో ఎక్కించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె ఎవరి మాట వినలేదు. కాసేపు నడిరోడ్డుమీద న్యూసెన్స్ చేసింది. ఆ తర్వాత.. అధికారులు ఆమెను అక్కడి నుంచి పంపించి వేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై వీడియో వైరల్ కావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని లేబర్ శాఖ అధికారులు పోలీసులను కోరారు.

Woman Gangraped In UP's Shahjahanpur..

ప్రస్తుతం మహిళలపై ప్రతిరోజు అఘాత్యాలు జరుగుతునే ఉన్నాయి. ప్రభుత్వాలు.. దిశ, నిర్భయ వంటి ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చిన కొందరు నీచులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో దారుణ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళను ఐదుగురు కామాంధులు ఇంటిలోపలికి లాక్కెళ్లారు. ఆ తర్వాత.. ఆమె నోరు మూసి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో మిగతా వారు ఘటనను తమ సెల్ ఫోన్ లో బంధించారు. ఈ ఘటన ఏప్రిల్ 22 న జరిగినట్లు బాధితురాలు తెలిపింది. ఘటన తర్వాత .. బాధితురాలిని నిందితులు బెదిరించారు.

పోలీసులకు చెబితే వీడియో వైరల్ చేస్తామని హెచ్చరించారు. దీంతో బాధిత యువతి కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో మరోసారి నిందితులు వేధింపులకు పాల్పడటంతో జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. కాగా, ఈ దారుణానికి చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకొవడానికి  ప్రత్యేక  పోలీస్ టీమ్ లను రంగంలోనికి దింపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Drunk and drive, Uttar pradesh, Viral Video

తదుపరి వార్తలు