విజయవాడలో ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన ఆ వాహనం ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణం దెబ్బతినడమే కాకుండా, అక్కడ పార్క్ చేసిన ఆటోలు, బైక్‌లపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. ఈ ఘటన సీతారాంపురం లాల్ బహదూర్ శాస్త్రి వీధిలో చోటుచేసుకుంది. అయితే, అక్కడ ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ అక్కడ ఎవరైనా ఉండి ఉంటే.. ఘోరం జరిగిపోయేది. ఆ వాహనం కింద నలిగిపోయేవారు. కారును వేగంగా నడపటం వల్ల అదుపు తప్పి ఘటన జరిగినట్లు తెలిపింది. కాగా, కారును మైనర్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడిపితే.. భారీ జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయినా.. మైనర్ల చేతికి వాహనాలు అప్పజెప్పి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదని పలువురు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, CAR, Car accident, Vijayawada