నెల్లూరులో మహిళ మిత్ర పోలీసు వాలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం...జీతం ఎంతో తెలుసా..?

సేవా దృక్పదం, సామాజిక స్పృహ కలిగిన గ్రామీణ ప్రాంతాలలోని ఔత్సాహికులైన మహిళలు పోలీసు వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకోనవచ్చు. వీరికి నెలకు రూ. 1000 గౌరవ వేతనం ఇవ్వనున్నారు.

news18-telugu
Updated: July 23, 2019, 11:14 PM IST
నెల్లూరులో మహిళ మిత్ర పోలీసు వాలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం...జీతం ఎంతో తెలుసా..?
ఏపీ డీజీపీ సమక్షంలో మహిళా మిత్ర సమన్వయ కర్తల సమావేశం(Twitter)
  • Share this:
మహిళా భద్రతే పరమావధిగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘మహిళా మిత్ర’ల నియామకం జరుగుతోంది. పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా నిఘా పెట్టినా.. ఎక్కడికక్కడ మహిళలపై వేధింపులు, అకృత్యాలు ఆగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు భయంతో పోలీసులను ఆశ్రయించకుండా దూరంగా ఉండిపోతున్న నేపథ్యంలో, అసలు అలాంటి సంఘటనలు బయటకు రావడం లేదు. దీంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంఏలో గ్రామస్థాయి నుంచి మహిళా పోలీసు వలంటీర్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారిద్వారా మహిళలకు భరోసా కల్పించేందుకు నెల్లూరు జిల్లాలో వెయ్యి మంది వలంటీర్ల నియామకానికి పోలీసు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మహిళా వాలంటీర్ల నియామకం వివరాలను తెలిపారు. ఇందుకోసం మహిళ నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.

సేవా దృక్పదం, సామాజిక స్పృహ కలిగిన గ్రామీణ ప్రాంతాలలోని ఔత్సాహికులైన మహిళలు పోలీసు వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకోనవచ్చు. వీరికి నెలకు రూ. 1000 గౌరవ వేతనం ఇవ్వనున్నారు. 21 సంవత్సరాలు వయస్సు నిండి ఉండడంతో పాటు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎటువంటి క్రిమినల్ కేసులలు ఉండరాదు. ఎంపిక చేసిన మహిళా పోలీసు వాలంటీర్ల ద్వారా గృహ హింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపుల సమాచారంతో పాటు అత్యాచారాలు, మానవ అక్రమ రవాణా నేరాలకు సంబందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ లకు చేర్చే విధంగా వీరి సేవలు వినియోగించుకుంటారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ లలో ఈ నెల 24వ తేదీ నుంచి నుండి అందుబాటులో ఉండనున్నాయి.


 First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు