బాగా ఫీల్ అయిపోతున్న మహేష్ బాబు...

అందుకే మహేష్ ఎమోషనల్ అయిపోతున్నారని సమాచారం. అయితే ఈ ఘటనపై మహేష్ స్పందించిన తీరుపై అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 11:14 AM IST
బాగా ఫీల్ అయిపోతున్న మహేష్ బాబు...
మహేష్ బాబు ఫైల్ ఫోటో
  • Share this:
షాద్‌నగర్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. యావత్ దేశమంతా మండిపడుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్ హీరోలంతా ఈ ఘటనపై భగ్గుమంటున్నారు.నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అందరిలా కాకుండా మహేష్ బాబు తన మాటల రూపంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తన స్వరాన్ని వినిపించాడు. ఓ వీడియో తీసి ఇప్పటికే తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేశాడు. ఇప్పటికే ఇది వైరల్ మారుతోంది. బరువెక్కిన హృదయంతో బాధగా మహేష్ ఈ వాయిస్ ఓవర్ చెప్పినట్టు అర్థమవుతుంది.తాజాగా ఇవాళ కూడా షాద్ నగర్ ఘటనపై మహేష్ మరోసారి ట్వీట్లు చేశాడు. ఇలాంటి దారుణాలు ఇక ముందు జరగకుండా కఠిన చట్టాలు, చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆవేదన బాధ ఎవరు తీర్చలేనిదన్నారు. నిందితులకు కఠిన చర్యలు పడి. బాధితురాలికి న్యాయం చేసేందకు అందరం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు మహష్. మొత్తానికి ఓ కూతురికి తండ్రిగా ఉన్న ప్రిన్స్‌ను షాద్‌నగర్ హత్యాచార ఘటన తీవ్రంగా బాధపెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే మహేష్ ఎమోషనల్ అయిపోతున్నారని సమాచారం. అయితే ఈ ఘటనపై మహేష్ స్పందించిన తీరుపై అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా అభిమాని హీరోకి ఇంత సామాజిక బాధ్యత ఉందా అని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఫ్యాన్స్ అంతా మహేష్ ట్వీట్లను లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. మహేష్ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Published by: Sulthana Begum Shaik
First published: December 1, 2019, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading