• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAHBUBNAGAR SCHOOL BUS HITS A GIRLDIED ON SPOT MS

విషాదం : స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

విషాదం : స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాలిక మనోజ్ఞ

ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని ఊరుకొండ గ్రామంలో మనోజ్ఞ(5) అనే బాలిక మృతి చెందింది. బాలిక మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.

  • Share this:
    నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మనోజ్ఞ(5) అనే బాలిక మృతి చెందింది.
    బాలిక మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో ఘటనలో హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో స్కూల్ బస్సు ఢీకొని తాసిన్‌ బేగం(2) అనే చిన్నారి ప్రాణాలు విడిచింది. సోమవారం ఉదయం వివేకానందనగర్ మీదుగా వెళ్తున్న రావూస్ స్కూల్ బస్.. అటుగా వెళ్తున్న తాసిన్‌ను ఢీకొట్టింది. తాసిన్ సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కుమార్తె మృతితో తాసిన్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
    Published by:Srinivas Mittapalli
    First published: