MAHARSHTRA GONDIA GIRL NAKED DEAD BODY FOUND IN AAMGAON SUSPECT TO BURN BODY WITH ACID PVN
Shocking : బాలికపై గ్యాంగ్ రేప్..ముఖాన్ని యాసిడ్ తో కాల్చి అర్థనగ్నంగా అడవిలో
ప్తతీకాత్మక చిత్రం
Girl half naked dead body : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు.
Rapes On Girls :ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి( Gang Rape On Girl) పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని అల్వార్ లో వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఓ మైనర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి ఇంటి సమీపంలోనే మంగళవారం రాత్రి నిందితులు.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు,మహారాష్ట్ర గోందియా జిల్లాలో కింగ్ కేసు వెలుగుచూసింది. ఆమ్గావ్ తాలూకాలోని కుంభార్ టోలా అటవీ ప్రాంతంలో అర్ధనగ్నంగా ఓ బాలిక మృతదేహం(Girl Naked Dead Body) లభ్యమైంది. స్థానికులు కొందరు పూలు కోసేందుకు వెళ్లగా అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన బాలిక మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలికను గుర్తుపట్టే వీలు లేకుండా ముఖాన్ని కాల్చారు దుండగులు. ముఖం సగానికిపైగా కాలిపోయింది. అయితే యాసిడ్ తో దుండగులు బాలిక ముఖాన్ని కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బాధితురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు., మృతురాలి వయసు 15-17 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు.
ఇక, వెస్ట్ బెంగాల్ లోని మాల్దా జిల్లా కాలియాచాక్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఎనిమిదో తరగతి చదివే బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బుధవారం రాత్రి బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో.. ఆమెను బయటకు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.